Tuesday, May 2, 2023

మజిలీ - 11వ భాగం

 నాకు హారతి ఇచ్చి ఇంటిలోనికి తీసుకెళ్లిన తరువాత నేను నా బెడ్ రూంలోకి వెళ్లాను. అక్క నా వెనుకగా వచ్చి నేను కట్టుకున్న చీర సందుల్లోంచి తన చేతులతో నా నడుము వెనుకనుంచి నన్ను కౌగిలించుకొని "ఎంత ముద్దొస్తున్నావే..... నమ్మలేనంతగా మారిపోయావు...... నిన్ను చూస్తే నాకే కుళ్ళొచ్చేస్తోంది" అంది.

నేను తన చేతులను విడిపించుకొని "చెప్పాను కదే...... నీ కంటే బాగా చూపిస్తాను నాలోని ఆడతనం అని" అంటూ కన్నుకొట్టాను.

ఈలోపు అమ్మ వచ్చి అక్కతో నీ చెల్లి దేశాలు దాటి వచ్చింది....దగ్గరుండి స్నానం చేయించవే అంది.

నేను చేస్తానులేవే...... అదెందుకు అన్నాను

అక్క "అంతే లేవే... అన్నీ మర్చిపోయావు. ఆరోజు నీకు చీర కట్టబట్టే సిద్ధూ నిన్ను కౌగిలించుకున్నాడు..... ఆ కౌగిలి స్పర్శకే తనకి నువ్వు పడిపోయావు..... ఇప్పుడు అవసరం తీరిపోయింది ఇక మమ్మల్ని వద్దంటావులే" అని బుంగమూతి పెట్టింది.

ఆరోజు అంతా రెస్ట్ తీసుకున్నాను. మర్నాడు అత్తమ్మ ఫోన్ చేసి అమ్మానాన్నలతో మాట్లాడాలి ఇంటికి వస్తున్నాను అని చెప్పారు

అమ్మానాన్నల హడావుడి అంతా ఇంతా కాదు. కానీ అప్పటికే సిద్ధూ హడావుడి పడొద్దని బెంగళూరులోని ఫేమస్ వెజిటేరియన్ రెస్టారెంట్ లో ఫుడ్ ఆర్డర్ చేశానని  అమ్మానాన్నలకు చెప్పి ఏమీ కంగారు పడొద్దని చెప్పాడు. అయినా వీళ్ళ హడావుడి ఒకవిధంగా లేదు.

అక్క నన్ను పిలిచి  తలంటు పోస్తాను బాత్రూంలోకి రమ్మని పిలిచింది. నేను చేస్తానులేవే అంటున్నా నన్ను చేయించమంది అమ్మ నోరుమూసుకుని రా అని పిలిచింది. ఇక తప్పక బాత్రూంలోకి వెళ్లాను.

మొత్తం బట్టలు తీసేయమంది. నేను వద్దు వద్దు అంటున్నా 'మనలో మనకి సిగ్గేమిటే...... ఇప్పుడు ఇద్దరం ఆడవాళ్ళమే' అంటూ చీర పవిట లాగేసింది. నేనేమో తన ప్రయత్నానికి అడ్డుపడబోతుంటే ఇక చీర కుచ్చిళ్ళు కూడా లాగేసింది. ఇక తప్పక నేను మిగిలినవి విప్పేశాను. తనముందు దిశ మొలతో నిలబడినప్పుడు చాలా సిగ్గుగా అనిపించింది. నన్ను స్టూల్ మీద కూర్చుండబెట్టింది.

ఈలోపు బాత్రూం తలుపుపైన తట్టిన శబ్దం.... అమ్మ పిలుస్తోంది బయటినుండి. అక్క తలుపు తీసింది. అమ్మ చేతిలో పసుపు, కొబ్బరినూనె, వేపాకు పేస్ట్, సున్ను పిండి కలిపిన పేస్ట్ తీసుకొచ్చి వొళ్ళంతా పట్టించమని చెప్పింది అక్కకి.

నేను ఇవన్నీ అవసరమా అమ్మా. పార్లర్ కి ఫోన్ చేస్తే రోహిణి వస్తుందికదా అంటే అక్క 'మీరు ఉన్నవాళ్లే ఒప్పుకుంటాం కానీ దేశాలు దాటి వచ్చావు కదా ఇన్ఫెక్షన్స్, చూసిన వారి దిష్టి పోవడానికి ఇట్లా చేస్తారు మా పేదవారి ఇళ్లల్లో.... నోరుమూసుకుని చేయించుకో..... పెళ్ళై మీ అత్తారింటికి వెళ్ళాక మీ అత్తగారు చెప్పినట్లు విందువు" అంది

ఇక మాట్లాడకుండా స్టూల్ మీద నగ్నం గా కూర్చుంటే అక్క మొఖానికి, నా రొమ్ములకు, మొత్తం శరీరానికి, నాలో డాక్టర్స్ క్రొత్తగా ఏర్పరచిన నా యోని భాగంలో కూడా ఆ పేస్ట్ రాస్తూ "ఎక్కడుండాల్సినవి అక్కడ ఉన్నాయికదా.... ఇక మీ ఆయన రోజూ జాగారం చేయిస్తాడు నీతో" అంది.

పేస్ట్ రాయడం అయిపోయిన తరువాత పది నిమిషాలు ఆగి తలపై నుండి గోరువెచ్చని నీళ్ళు పోసి కుంకుడుకాయలతో తల స్నానం చేయించింది అక్క.

స్నానం అయిన తరువాత ఒళ్ళంతా టవల్ తో తుడిచి తెలుపు లంగాని నా తలపై నుండి తొడిగి నా రొమ్ములపై నుండి మోకాళ్ళ పై వరకు ఉండేట్లు ఉంచి లంగా బొందుని కొంచెం వదులుగా ముడి వేసి బయటకు బెడ్ రూంలోకి తీసుకువచ్చింది అక్క.

బెడ్ రూంలోకి వచ్చేసరికి ఆ రూమంతా సాంబ్రాణి పొగతో నిండి పోయింది. అమ్మ ఒక మట్టి కుండలో బొగ్గులు వేసి దానిపై సాంబ్రాణి వేసి పొగ పెట్టింది.

అక్క నన్ను తీసుకువెళ్లి కుర్చీలో కూర్చుండబెట్టి నా జుత్తుకి సాంబ్రాణి పొగ పట్టించింది. నన్ను నిలువబెట్టి కాళ్ళు ఎడముగా ఉండేట్లు చేసి పొగ నా ఒంటికి పట్టేట్లు చేసింది.

అంతా అయ్యాక చీర కట్టుకొమ్మని కాటన్ చీర, మాచింగ్ బ్లౌజ్ ఇచ్చింది. నేను బ్రా, ప్యాంటీ లు తీసుకుందామానుకుంటే అక్క ఈరోజుకి అవేమీ లేకుండా కట్టుకొమ్మని చెప్పింది. కేవలం లోపలి లంగా, జాకెట్టు, పైన కాటన్ చీర కట్టుకున్నాను.

ఇదంతా అయ్యేసరికి ఉదయం 11 గంటలయ్యింది. నాకు ఒళ్ళంతా ఫ్రీగా ఉండి కళ్ళు మూతలు పడిపోతున్నాయి. కాసేపు పడుకుంటానంటే అమ్మ భోజనం చేసి పడుకొమ్మని భోజనం పెట్టేసింది. ఆ తరువాత పడుకుంటే నిద్ర పట్టేసింది.

అక్క పెట్టిన  నలుగుకి, తలస్నానానికి, సాంబ్రాణి ధూపానికి చక్కని నిద్ర పట్టేసింది. సాయంత్రం 5 గంటలకు అమ్మ వచ్చి నిద్ర లేపింది.

"మీ అత్తగారు వాళ్ళు బయలుదేరుతున్నారట. ఆవిడ కూడా వాళ్ళ బంధువులు కూడా వస్తున్నారట. ఒక పది మంది వస్తున్నారట. ఆవిడ వాళ్ళ బంధువులకు నిన్ను పరిచయం చేయడానికి వస్తున్నారట. త్వరగా లేచి ముస్తాబవ్వవే...... ఈ చీర కట్టుకో" అంటూ చిలకాకుపచ్చ రంగు కంచి పట్టు చీర, మాచింగ్ జాకెట్టు, అదే కలర్ లోపలి లంగా మంచం ప్రక్కనే ఉన్న టీపాయ్ మీద పెట్టింది.

ఆవిడ బంధువుల్ని వెంటబెట్టుకొస్తున్నారని అమ్మ చెప్పేసరికి నిద్ర మత్తు వదిలిపోయింది. త్వరగా లేచి లోపలి లంగా, గ్రీన్ కలర్ బ్రా, గ్రీన్ కలర్ ప్యాంటీ తీసుకుని బాత్రూంలోకి దూరి అప్పటి వరకు ఒంటిమీద ఉన్న కాటన్ చీర విప్పేసి స్నానం చేసి ప్యాంటీ తొడుక్కుని లోపలి లంగా కట్టుకొని, బ్రా తొడుక్కుని ఒంటి మీద పవిటలాగా టవల్ కప్పుకుని బెడ్ రూంలోకి వచ్చేసరికి అక్క బెడ్ మీద కూర్చుని నాకోసం ఎదురు చూస్తుంది.

బయటికి టవల్ పవిటలాగా వేసుకొచ్చిన నన్ను చూసి సంభ్రమంగా చూస్తోంది. ఏమిటే అట్లా చూస్తున్నావు అంటూ టవల్ ప్రక్కన కుర్చీపై వేసి చీర కట్టుకోవడం ప్రారంభించాను.

అసలే కంచిపట్టు చీర... అదెలాగ కట్టుకుంటాదో వెళ్ళి సాయం చేయమందట అమ్మ..... ఇక్కడ నేనేమో జాగ్రత్తగా చీరను కట్టుకుని కుచ్చిళ్ళు పోసుకుంటుంటే, శారీ సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటుంటే మా అక్క "నువ్వేనా..... ఇంత మార్పా..... ఒకప్పుడు మగాడిని నేను అని నీకు నువ్వు చెప్పినా నమ్మరే!" అంది.

నేను నవ్వుతూనే చీర కట్టుకోవడం ముగించి తల దువ్వుకుని జడ వేసుకోవడం పూర్తి చేసి ఫేసియల్ క్రీమ్స్ రాసుకుని, కంటికి లైట్ గా బ్లాక్ పెన్సిల్ తో టచ్ అప్స్ ఇచ్చుకుని పెదవులకు లిప్స్టిక్ అప్లై చేసుకుని జడలో అమ్మ ఇంతకు ముందే టేబుల్ మీద పెట్టిన మల్లెపూల దండ చెంపిన్ను సపోర్టుతో పెట్టుకుని అక్కా, ఎట్లా ఉన్నానే? అని అడిగాను.

అక్క ఏమీ మాట్లాడకుండా ముందుకు వచ్చి నాకు ముద్దు పెట్టి ఏమీ మాట్లాడకుండా ముద్దు పెడుతుంటే ఫోన్ మోగింది. అవతల నుండి సిద్ధూ....

"మా అమ్మ కూడా మా నాన్నగారి బంధువులు, మా అమ్మ తోబుట్టువులు వస్తున్నారు. ఏమీ కంగారు పడకు. పెళ్ళి డేట్ ఫిక్స్ చేయడానికి, మీ కుటుంబానికి మా మార్వాడి సాంప్రదాయాలు, పెళ్ళిలో ఏమేమి చేయాలో చెప్పడానికి వస్తున్నారు. ఒక పెద్దావిడ వస్తోంది వాళ్ళతో. ఆవిడ మా ఫ్యామిలీలో అందరికంటే పెద్దావిడ పేరు లక్ష్మి బెన్. ఆవిడ ఏమేమి చేయాలో చెబుతుంది. అది ఫాలో అయిపోవడమే. మీ అమ్మ వాళ్ళను కంగారు పడొద్దని చెప్పు.

రెస్టారెంట్ నుండి ఫుడ్ డెలివరీ చేయడానికి మీ ఇంటికి బయలుదేరారు. మావాళ్ళది జస్ట్ ఫార్మల్ విజిట్. కంగారు పడకు హనీ" అన్నాడు.

నేను "కంగారెందుకు.... అత్తమ్మ ముందే చెప్పారు నాకు. మీ ఇంటిలోకి వచ్చేదాన్ని మీ ఆచారాలు, సాంప్రదాయాలు నేర్చుకోవాలి కదా. మీరు ఫోన్ కట్ చేస్తే మా అత్తగారు వచ్చారు. వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి బేబీ" అన్నాను.

ఓకే ఓకే క్యారీ ఆన్.... అంటూ ఫోన్ పెట్టేసాడు సిద్ధూ. తీరా చూస్తే మా అత్తగారు కాదు. ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన వాడు. వాళ్ళు తెచ్చినవి అక్క, అమ్మ లోపల సర్దేశారు.

ఫుడ్ డెలివరీ చేసి హోటల్ వాడు వెళ్ళిపోయిన తరువాత కాసేపటికి అత్తమ్మ వాళ్ళు వచ్చేశారు. అమ్మ, నాన్న, అక్క, బావ అందరినీ సాదరంగా ఇంట్లోకి తీసుకువచ్చారు.

వచ్చిన వాళ్లందరికీ నేను ప్రతిఒక్కరికి పాదాభివందనం చేసి అక్కడ టీపాయ్ మీద వాటర్ గ్లాసెస్ పెట్టి అమ్మ, నాన్నల వెనుక నిల్చున్నాను. అత్తమ్మ అందరికీ నన్ను పరిచయం చేశారు.

లక్ష్మి బెన్ అనే ఆవిడ చాలా గంభీరంగా కనపడుతున్నా మాట్లాడడం మొదలుపెట్టాక ఆమె మీద గౌరవం పెరిగిపోయింది నాకు.

ఆవిడ అమ్మ నాన్నలకు మార్వాడీ వివాహ పద్ధతి అందులో ఉండే పద్ధతులు, దశలు చెప్పారు.

పెళ్ళికి ముందు "రోకా, మహిరా దస్తూర్, తిలక్" నుండి పెళ్ళి తరువాత "బిదాయి, గృహప్రవేష్ మరియు జువా ఖిలాయ్" వరకు మొదలైన మార్వాడీ వివాహ సంప్రదాయాలను గురించి వాటిని ఎట్లా చేయాలో వివరంగా చెప్పారు. అదేవిధంగా నెల తరువాత ఒక డేట్ చెప్పి ఆరోజున పెళ్ళి అని చెప్పారు. అమ్మానాన్నలను ఆ ఏర్పాట్లు చేయమని వారి కుటుంబం గౌరవాన్ని బట్టి స్థాయిని బట్టి ఏ లోటూ రాకుండా చూడమని మరీ మరీ చెప్పారు. అన్నిటికీ నాన్న ఓకే చెప్పేశారు. ఎందుకంటే ఆయన వెనకాల కొండలాంటి ఆయనకి కాబోయే అల్లుడున్నాడనే ధైర్యం అనుకున్నాను.


 



భార్యగా మారిన బావ (మొదటి భాగం)

నా పేరు సత్యశ్రీ, వయసు 33.... నా భర్త జయంత్, వయసు 33.... మాకు ఒక్కగానొక్క కూతురు పవిత్ర, వయసు 7 సంవత్సరాలు. నా భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా క...