నేనన్న మాటలకు వాళ్ళ మొఖాలు చూస్తుంటే మా పేరెంట్స్ కి నేనన్న మాటలు షాకింగ్ గానే అనిపించాయి. మా అక్క బహుశా ఊహించే ఉంటుందేమో తను వాళ్ళను మానసికంగా సిద్ధపరచడానికేమో నా మాటలను ఈజీగా తీసుకున్నట్లుగా 'ఇప్పుడు నిజమైన నా చెల్లిగా అనిపించావే. నువ్వన్నది కరెక్టే. ఎందుకంటే మన కుటుంబానికి వాళ్ళు చేసినదానికి నువ్వు తీసుకున్న నిర్ణయం సరైన రీతిలో ఋణం తీర్చుకున్నదానివి అవుతావు. ఇక అమ్మానాన్నలు ఇప్పటికే నిన్ను ఒక ఆడదానిగా భావిస్తున్నారు. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతే నీ ఐడెంటిటీ కూడా ఎవరికీ తెలియదు. అమ్మానాన్న ఇద్దరూ నీతోనే ఉంటారు. సిద్దార్ధ కూడా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. నిజానికి అతను గే కాదు అతను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు. మగవాడిగా ఉన్న నువ్వు ఆడదానిగా మారినా భవిష్యత్తులో నువ్వు ఆనందపడతావు గానీ పశ్చాతాప పడాల్సిన అవసరమే నీకు రాదు. ఇది నా స్ట్రాంగ్ ఫీలింగ్' అంటూ మా నాన్నను ఉద్దేశించి "మీరేమంటారు నాన్నా" అని అడిగింది.
మా నాన్న నిట్టూరుస్తూ "మన కుటుంబానికి ఈ పరిస్థితి కేవలం నా అసమర్ధత వల్ల వచ్చింది. అయినప్పటికీ మీ ఇద్దరూ నాకు గౌరవమిస్తుంటే నాకు గిల్టీగా ఉందిరా. ఏదేమైనా నా కొడుకు కూతురుగా మారతాను అంటే బాధగా ఉన్నా మన కుటుంబానికి సిద్ధార్ద్ చేసిన మేళ్లకు కృతజ్ఞతగా నా కొడుకు సెక్స్ చేంజ్ చేసుకుంటానంటే నాలో కొంచెం సంశయాలు ఉన్నా ఇదే కరెక్ట్ అనిపిస్తోంది. తను ఇచ్చిన అమౌంట్ తో అప్పులు తీర్చేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాము. ఆ తరువాతే వీడి సెక్స్ చేంజ్' అంటూ సోఫాలోనుండి లేచి నా నుదిటిపై ముద్దు పెట్టుకున్నారు.
మా ముగ్గురి మాటల్ని వింటున్న మా అమ్మ కన్నీళ్లు తుడుచుకొని నన్ను ప్రేమగా హత్తుకొంది. ఆ హత్తుకోవడంలో తన సంపూర్ణఅంగీకారం కనిపించింది.
ఇక మా అక్క వాతావరణాన్ని తేలిక పరచడానికి "చెల్లి ఇక హ్యాపీనా? మా మరిది గారికి ఫోన్ చేసి చెప్పు" అంది. నాకు సిగ్గనిపించింది. తల వంచుకున్నాను గానీ మనసంతా సంతోషమే. పైకి మాత్రం 'పోవే నువ్వు ఎక్కువ చేస్తున్నావు' అంటూ బెడ్ రూంలోకి పరుగెత్తుకుంటూ వెళ్ళి తలుపు వేసికొని బెడ్ మీదకు వాలి నా ఫోన్ తీసికొని సిద్ధుకి ఫోన్ చేశాను.
తను ఫోన్ ఎత్తగానే నేను అసంకల్పితంగా ఫోన్లోనే ముద్దు పెట్టాను. అవతలనుండి "బేబీ! ఏమైంది? హ్యాపీగా ఉన్నట్లున్నావు" అని అడిగాడు.
నేను సంతోషంగా 'హనీ! మా ఫ్యామిలీ కి నా సెక్స్ చేంజ్ గురించి చెప్పగానే నా డెసిషన్ ని యాక్సిప్టు చేసేసారు అంటూ ఎక్సయిటింగ్ గా చెప్పాను. అవతలనుండి కూడా సేమ్ ఎక్సయిట్మెంట్.
"వావ్.... థాంక్ యూ హనీ" అంటున్నాడు సిద్ధార్ద్.
"ఒట్టి థాంక్స్ చెబితే సరిపోదు సిద్ధార్ద్ గారూ.... కావలసిన ఏర్పాట్లు చూడండి..... ముందు మా అత్తగారికి కూడా చెప్పండి.... " అన్నాను
"జీ..... జహాంపనా..... అమ్మాయిగారు ఎట్లా చెబితే అట్లానే చేస్తాడు నీ పాదదాసుడు....." అన్నాడు సిద్ధార్ద్.
నాకు తను అన్న 'పాదదాసుడు' అనే మాటకు బాధనిపించి "సిద్ధూ..... నువ్వు కాదు నేను ఎప్పటికీ నీ పాదాల దగ్గర ఉండాలి..... ఎప్పుడూ ఆ మాట అనకు..... నీకోసం నేనేమి చేసినా తక్కువే.... ఎప్పుడూ నా దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకోకు..... నేను తట్టుకోలేను....." అన్నాను.
అటువైపు నుండి కాసేపు నిశ్శబ్దం.... వాతావరణాన్ని తేలిక పరుద్దామనుకున్నాడేమో...."సరే డియర్..... అమ్మతో ఈవిషయం చెప్తాను..... ఒక పదిహేను నిమిషాల తరువాత అమ్మతో మాట్లాడు. నాకు మీటింగ్ టైం అవుతోంది. బై.... విల్ కాల్ యూ సూన్.... " అంటూ ఫోన్ పెట్టేసాడు.
సిద్ధార్ద్ మా ఇంటికి రావడం దగ్గరనుండి జరిగిన విషయాలన్నిటినీ గుర్తుకు తెచ్చుకుంటే నాకే షాకింగ్ గా ఉన్నాయి..... మరి మా ఇంట్లో వాళ్ళు.... వాళ్ళింట్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో? పైగా ఈ మహానుభావుడు వాళ్ళ అమ్మతో మాట్లాడమంటున్నాడు అనుకుంటూ ఉండగా మా అక్క నా బెడ్ రూంలోకి వచ్చి "ఏమిటే సిద్ధార్ద్ ఏమంటున్నాడు.... కేవలం రెండు రోజుల్లో ఎంత మార్పే చెల్లీ నీలో..... నాకే నమ్మశక్యంగా లేదు. ఇంట్లో ఎవరూ లేని ఈరెండు రోజుల్లో ఏమి జరిగిందో చెప్పవే" అంది.
సిద్ధార్ద్ నన్ను ఔటింగ్ కి తీసుకెళ్లడానికి చేసిన ఏర్పాట్లు, రోహిణి నన్ను తయారు చేయడం, మేకప్ టిప్స్ నేర్పడం, తరువాత ఫార్మ్ హౌస్ కి వెళ్లడం, తనూ నేనూ ఒకే రూంలో పడుకోవడం, నేనూ తనూ మాట్లాడుకోవడం, మరుసటి రోజు వాళ్ళ అమ్మగారితో షాపింగ్ చేయడం అవన్నీ చెప్తుంటే మా అక్క అబ్బురంగా వింటూ "రెండు రోజులు ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి ఎన్ని చేసావే? మొదట్లో ఇష్టం లేదన్నదానివి ఆమ్మో..... ఆమ్మో అసాధ్యురాలివే బాబూ అంటూ ఆటపట్టించసాగింది.
ఈ మాటల్లోనే నాకు సిద్దార్డ్ పంపిన డ్రెస్సెస్, వాళ్ళమ్మగారు కొనిపెట్టిన చీరలు, నగలూ అవి చూపించాను. మా అక్క కళ్ళల్లో కొంచెం ఈర్ష్య కొట్టొచ్చినట్లు లీలగా కనిపించింది. తనతో మాటల్లో పడి సిద్ధూ వాళ్ళమ్మగారితో మాట్లాడమన్నాడనే విషయం మరిచిపోయాను.
ఒక గంట తరువాత మా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఆ సమయానికి అక్క, అమ్మ మాట్లాడుకుంటున్నారు ఆ టైంకి. నేను నా రూంలో ఉన్నాను. అక్క వెళ్ళి తలుపు తీసింది. తీరా తలుపు తెరచి చూస్తే సిద్ధూ వాళ్ళమ్మగారు. అక్క నన్ను పిలిచేసరికి నేను బయటకి వెళ్ళి ఆవిడని చూసి చీర చెంగుని తలపై వేసుకుని వెళ్ళి ఆమె పాదాలను స్పృశించాను. ఆమె ముఖంలో ఆనందం.... మా వాళ్ళ ముఖాలలో షాక్.... ఆమె నన్ను దగ్గరకు తీసుకుంటూ "జీతే రహో బేటీ.... సిద్ధూ ఫోన్ చేసి చెప్పేసరికి ఆనందం పట్టలేకపోయాను.... నువ్వు ఫోన్ చేస్తావు అన్నాడని ఎదురు చూశాను.... బహుశా సిగ్గుపడుతున్నావేమో అని ఆగలేక నేనే వచ్చేసాను" అంటుంటే నాకు మాటలు రాలేదు.
ఈలోపు అక్క కాఫీ పట్టుకొచ్చింది.... మా అమ్మ నాన్నలకు ఆమెని చూచేసరికి కాళ్ళుచేతులు ఆడడంలేదు.... ఆమె మాత్రం నవ్వుతూ, నన్ను ప్రక్కన కూర్చుండబెట్టుకుని మాటలాడుతూ "భాయీ సాబ్! సిద్ధూ రావడానికి మూడురోజులు పడుతుందట.... నేను ఒక్కదానినే ఉండలేక నీలిమను తోడుగా తీసుకెళ్దామనుకుంటున్నాను మా ఇంటికి.... పెళ్ళికి ముందు ఇట్లా అడుగుతుందేమిటి అనుకోకుండా నాతో పంపుతారా" అని మా నాన్నను అడిగారు.
నాన్న చాలా వినయంగా "చెల్లెమ్మా! మీరు అంతలా ప్రాధేయ పడి అడగాలా? మీ ఇంటికి రావలసిన అమ్మాయే కదా తీసుకెళ్లండి.... మీకు తను మీఇంట్లో యెట్లా ఉండాలో నేర్పినట్లు ఉంటుంది..... మీరు ఫోన్ చేసి చెప్తే పంపాలి మేము అటువంటిది మీరు స్వయంగా రావాలా" అన్నారు.
ఆమె "ఎటువంటి పరిస్థితుల్లో మీ ముందు ఈ ప్రపోసల్ పెట్టామో మీకు తెలుసు. ఒప్పుకున్నాక అవసరం తీర్చుకుని వదిలేయకుండా నా మాటలు నిజం చేయడానికి తను నన్ను సంతృప్తి పరచడానికి దేవుడు తనకిచ్చిన అవయవాలను కూడా తొలగించుకోవడానికి, సంపూర్ణ స్త్రీగా మారడానికి తనకి తానుగా ఒప్పుకోవడం మాటలు కాదు.... అది తనకు మీరు నేర్పిన సంస్కారం.... అందుకే మీకు ఫోన్లో చెప్పకుండా స్వయంగా వచ్చాను భాయీ సాబ్...". అంటూ నాతో సిద్ధూ వచ్చేవరకు నాకు తోడుగా ఉంటావా అని అడిగారు.
నాకు నోటివెంట మాటలు రావడంలేదు. కేవలం తల ఊపాను. మా అక్క ఇదంతా షాకింగ్ ఎక్సప్రెషన్ తో చూస్తోంది.
నిన్న నేను కొన్న చీరలూ, నైటీలు తెచ్చుకో..... టైలర్ కి ఫోన్ చేసి జాకెట్లు "మనింటికి" తీసుకొచ్చేయమన్నాను అన్నారావిడ. నేను సరే అని బెడ్ రూంలోకి వెళ్ళి చీరలు, నైటీలు, నగలు ట్రాలీలోకి సర్దుకుంటుంటే మా అక్క వెనుకగా వచ్చి "అదృష్టవంతురాలివే..... అత్తగారి పెత్తనం చేయకుండా మనిల్లు అంటోందావిడ. త్వరగా స్నానం చేసి వెళ్ళు..... ఆవిడ వెయిట్ చేస్తున్నారు" అంది.
నేను త్వరత్వరగా స్నానించి, లైట్ గ్రీన్ షిఫాన్ శారీ కట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంటే మా అక్క మేకప్ చేసుకోవడంలో హెల్ప్ చేస్తుండగా ముస్తాభై హాల్లోకి వెళ్లాను.
ట్రాలీ తీసుకువెళ్లి కారులో పెట్టడానికి డ్రైవర్ ని పిలిచిందావిడ. వైట్ యూనిఫామ్ లో ఉన్న డ్రైవర్ వచ్చాడు. ట్రాలీ తీసుకుని వెళ్ళి కారులో పెట్టాడు డ్రైవర్.
మా ఇంట్లో వాళ్లకు వెళ్ళొస్తానని చెప్పి నా కాబోయే అత్తగారి వెంట నడిచాను. ఇంటి పెత్తనం అంతా ఆవిడదే అనుకుంటాను.... డ్రైవర్ కిక్కురుమనకుండా కార్ డ్రైవ్ చేశాడు. ఒక 30 నిమిషాలకు సిద్ధూ వాళ్ళింటికి చేరుకున్నాము. చెప్పడం మరచిపోయాను.... ఇంటి నుండి బయలుదేరినది మొదలు సిద్ధూ వాళ్ళింటికి చేరేవరకు నా చీర పల్లుని నా నెత్తిమీదనే వేసుకుని వెనుక సీట్లో మా అత్తగారి ప్రక్కన కూర్చున్నాను. కార్ ఎక్కినది మొదలు ఇంటికి చేరేవరకు ఒక్క మాటకూడా లేదు.
ఇంట్లో అడుగుపెడుతుంటే నాకేదో తెలియని బెరుకు, భయం. ఇల్లు చాలా పెద్దది ట్రిప్లెక్స్ హౌస్ అది. లోపల మెట్లే కాదు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. నన్ను ఆప్యాయంగా లోపలికి తీసుకువెళ్లి "కుసుమా! చిన్నమ్మగారిని అయ్యగారి రూంలోకి తీసుకువెళ్ళు... " అని ఒకమ్మాయికి చెప్పారావిడ. ఆ అమ్మాయి కొంచెం మోడరన్ గా..... సింపుల్ గా..... పంజాబీ డ్రెస్సులో ఉంది..... చదువుకున్నదానిలానే కనపడుతోంది.
ఒక 25 ఏళ్ళు ఉంటాయేమో ఆ అమ్మాయికి వెంటనే పరుగెత్తుకు వచ్చి నా వెంట తీసుకెళ్లిన లగేజ్ తో పాటు ఒక బిగ్ షాపర్ తెచ్చింది. అందులో టైలర్ డోర్ డెలివరీ ఇచ్చిన జాకెట్స్ ఉన్నాయి.
నాతో సిద్ధార్ద్ వాళ్ళమ్మగారు "ఫ్రెష్ అయి రెస్ట్ తీసుకో.... పైకి నేనే వస్తాను..... ఈవెనింగ్ టెంపుల్ కి వెళదాం సరేనా!" అంటూ పనిమనిషికి నన్ను పైకి తీసుకెళ్ళమని సంజ్ఞ చేశారామె.
ఆ అమ్మాయి నాతో "రండి చిన్నమ్మగారూ" అంటూ లిఫ్ట్ వైపు తీసుకెళ్ళింది. లిఫ్ట్ ఎక్కి 2వ ఫ్లోర్ కి వెళ్ళి సిద్ధూ గదిలోకి వెళ్తే అసలు అది ఒక బెడ్ రూమ్ కాదు... అది ఒక లగ్జరీ సూట్. అందులో కామన్ ఏరియా, రెండు బెడ్ రూమ్స్, కామన్ ఏరియా లో ఒక వైపు కంప్యూటర్స్, ఆఫీస్ రూమ్, ఇంకో వైపు కూర్చొని మాట్లాడుకోవడానికి అత్యంత ఖరీదైన సోఫాలు ఉన్నాయి. ఇక ఆ అమ్మాయి "చిన్నయ్య గారి బెడ్ రూమ్ అమ్మా ఇది. అమ్మగారు మిమ్మల్ని వేరే బెడ్ రూమ్ కి తీసుకెళ్లమన్నారు.... మీరు రాకముందే మీ దగ్గరికి బయలుదేరేముందే నాతో దగ్గరుండి మరీ రూమ్ సర్థించారు. మీకేమన్నా అవసరమైతే 1002 నెంబరుకి ఇంటర్‌కమ్ లో నన్ను పిలవండి. వచ్చేస్తాను" అని గడగడ చెప్పి ఆ రూంలో నుండి క్రిందికి వెళ్ళడానికి నా అనుమతి కోసం ఎదురు చూస్తోంది.
నేను "థాంక్స్.... నీ పేరేమిటి?" అని అడిగాను.
"వెల్కమ్ మేడం.... నా పేరు కుసుమ సౌజన్య. మా అమ్మానాన్న చనిపోయారు. ఈ ఇంట్లోనే పనిచేసేవారు. పెద్దమ్మ గారే నన్ను చదివించారు. చిన్నయ్య గారైతే నన్ను సొంత చెల్లెలిలా చూసుకుంటారు. MBA వరకు చదువుకున్నాను. ఈ ఇంటికి హౌస్ కీపర్ కమ్ మేనేజర్ గా పని చేస్తున్నాను. బయటి కంపెనీలో జాబ్ ఇప్పిస్తాను అన్నారు కానీ మా అమ్మానాన్న చనిపోయేసరికి నా వయసు 12 సంవత్సరాలు. అప్పటినుండి నన్ను అమ్మగారే పెంచారు.. చదివించారు. ఇక అందుకే ఇక్కడే పనిచేస్తాను అని అమ్మగారితో చెప్తే ఆవిడ నాకు ఈ ఇంటి మైంటెనెన్సు అప్పచెప్పారు. మీకేమన్నా అవసరమైతే ఫోన్ చేయండి మేడం...." అంటూ సెలవు తీసుకుంది.
ఇంతలో ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తే సిద్ధూ. "మేడం! మన ఇల్లు నచ్చిందా? ఇంకా ఏమైనా మార్పులూ, చేర్పులూ చేయాల్సిన అవసరం ఉందా?" అంటున్నాడు అవతలినుండి.
నేను "ఇప్పటికీ షాక్ నుండి తేరుకోలేదు బేబీ. మీ అమ్మగారు ఇంటికి రావడమేమిటి..... నన్ను తన వెంట మన ఇంటికి తీసుకురావడమేమిటి? అంతా షాకింగ్ గా ఉంది సిద్ధూ. నువ్వు ఫోన్ చేసి ఇంకా ఇబ్బంది పెట్టేస్తున్నావు" అన్నాను.
అవతల నుండి సిద్ధూ "ఇప్పుడే వచ్చారని చెప్పింది మమ్మీ..... సరే రెస్ట్ తీసుకో..... నైట్ కి మాట్లాడుతా....బై " అని ఫోన్ పెట్టేసాడు.
ఆ రూం అంతా కలియచూస్తుంటే నాకింత అదృష్టమా అనిపించింది. ఈలోపు ఇంటర్‌కమ్ మోగింది.
అవతలనుండి సిద్ధూ అమ్మగారు.(ఇక మా అత్తయ్య సారీ.... అత్తమ్మ అంటాను)
"నీలిమా.... ఫ్రెష్ అయ్యి క్రిందికిరా..... మనం బయటికి వెళదాం..... కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది..... ప్రాబ్లెమ్ ఏమీ లేదు కదా!" అన్నారు.
"ఫర్వాలేదు 'మా'జీ..... ఒక్క 15 మినిట్స్ లో వచ్చేస్తాను.".... అని ఫోన్ పెట్టేసి సిద్ధుకి ఫోన్ చేసి మీఅమ్మగారికి ఏ కలర్ చీర ఇష్టం అని అడిగితే రెడ్క లర్ ఇష్టం అని చెప్పాడు. థాంక్స్ అని ఫోన్ పెట్టేసి రెడ్‌లో కలర్ లోపలి లంగా, మాచింగ్ జాకెట్టు, బ్రా, పాంటీ తీసుకుని బాత్ రూంలోకి వెళ్ళి చూద్దునా ఒక ఫైవ్ స్టార్ హోటల్లో లా ఉంది. బాత్ టబ్, షవర్ అన్ని హంగులూ ఉన్నాయి. త్వరత్వరగా స్నానం చేసి టర్కీ టవల్ తో ఒళ్ళు తుడుచుకొని, పాంటీ బ్రా తొడుక్కుని లోపలి లంగా మరియు జాకెట్టు వేసుకుని బాత్రూం నుండి బయటకి వచ్చి మార్వాడీ స్టైల్లో చీర కట్టుకుని కుచ్చిళ్ళు పోసుకుంటుంటే నా వెనుక శబ్దానికి వెనక్కి తిరిగి చూస్తే అత్తమ్మ.
తనకిష్టమైన రెడ్ కలర్ చీర కట్టుకున్న నన్ను చూసి ఆమె ఎంతో సంతోషపడిపోయింది. ముందుకు వచ్చి నా నుదుటిపై ముద్దు పెట్టి..... నాకు జడవేసి, కొంచెం కొంచెంగా పౌడర్ అద్ది, సింపుల్‌గా ఉన్న సన్నపాటి డైమండ్ నెక్లెస్ నా మెడలో వేసి..... "ఇంత త్వరగా చీర కట్టుకోవడం నేర్చుకుంటావనుకోలేదు బేటీ...... వెరీ గుడ్..... మేకప్ ఏమైనా అవసరమైతే రోహిణికి ఫోన్ చెయ్యి బేటీ..... ఇంటిలో ఏమైనా అవసరమైతే కుసుమకి ఫోన్ చెయ్యి..... కుసుమ చిన్నప్పటి నుండి ఈ ఇంటిలోనే పెరిగింది.... ఒక విధంగా సిద్ధుకి చెల్లి..... నీకు ఆడపడుచు మాదిరి. సరే పద.... లంచ్ పూర్తి చేసుకుని బయటకి వెళదాం" అంటూ బయటకి నడుస్తుంటే నేనూ ఆమెను అనుసరించాను. ఆమె వెంట వెళ్ళేటప్పుడు చీర చెంగు నెత్తిమీద వేసుకోవడం మాత్రం మర్చిపోలేదు.
ఆవిడ నన్ను గమనిస్తూనే ఉంది.... ఆమెకు అనుకూలంగా నడుచుకుంటుండటంతో ఆమెకు నామీద సాఫ్ట్ ఇంప్రెషన్ కలిగిందినేది తెలిసిపోతోంది. ఆమె ముఖంలో ఆనందభావన నాకు కనపడుతోంది.... తద్వారా నాకు ఏదో సంతృప్తి.
డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాము..... మార్వాడీ మెనూ..... కుసుమ వడ్డిస్తుంటే లంచ్ పూర్తి చేశాము. ఆవిడ నన్ను తన రూంలోకి తీసుకువెళ్లారు. ఆవిడ రూంకూడా అదునాతనంగానే బాగుంది.
లోపల సోఫాలో నన్ను కూర్చోమని వెళ్ళి తలుపు మూసి వచ్చి నా ప్రక్కనే కూర్చున్నారు.
"బేటీ, సిద్ధూ నీ మీద ప్రేమను వ్యక్తీకరించినప్పుడు ఈ కుటుంబం, పరువు ప్రతిష్టలు ఏమైపోతాయో అనే భయం కలిగింది. అందుకే పెళ్లయ్యాక మిమ్మల్ని వేరుగా పెడదామనుకున్నాను. కానీ ఈ రెండురోజులుగా సిద్ధూ అభిప్రాయాన్ని పిచ్చిగా భావించకుండా గొప్ప ప్రేమగా భావించి తనను మనస్ఫూర్తిగా అంగీకరించావు.... మీ ఇంట్లో వాళ్ళుకూడా నీ సెక్స్ చేంజ్ కి అంగీకరించి నాకున్న మానసిక వ్యధని తొలగించారు. నీలిమా బేటీ, నాకొక మాటిస్తావా? మీ పెళ్లయ్యాక మీ అమ్మవాళ్లు హైదరాబాద్ వెళ్లినా నువ్వు, సిద్ధూ నాతోనే ఈ ఇంటిలోనే ఉంటారా?" అని ఆవిడ నా చేతిలో చెయ్యేసి అడుగుతూ ఉంటే నా హృదయం బరువెక్కిపోయింది.
నేను వెంటనే, "అత్తమ్మా, మీ అబ్బాయి ఒక మగవాడిని కోరుకుంటున్నాడని తెలిసికూడా తన కోరికని మన్నించి ఎక్కడా తెలీకుండా ఆ కోరికను మన్నించారు మీరు. మొదట మా ఆర్ధిక పరిస్థితి రీత్యా ఈ విచిత్రమైన ప్రపోజల్ కి ఒప్పుకున్నాను. ఆ తరువాత కేవలం డబ్బుకొరకు ఒప్పుకున్నారు వీళ్ళు అనే భావన లేకుండా నన్ను మీరు మనస్ఫూర్తిగా అంగీకరించారు. మీ పరువు ప్రతిష్టలకు ఏ విధమైన భంగం కలుగనివ్వను. చివరివరకు ఈ ఇంటినే నా ఇంటిగా భావించుకుని మీతోనే ఉంటాను. అత్తమ్మా, అందరూ ఉన్నప్పుడు మిమ్మల్ని నేను 'మా'జీ అని పిలిచినా మన ముగ్గురం ఉన్నప్పుడు మాత్రం 'అత్తమ్మ' అనే పిలుస్తాను. తెలుగులో మేనత్త అని అర్ధం అంటే అమ్మ తరువాత అమ్మ అని. నేను ఆవిడని అట్లా అడిగేసరికి ఆవిడ ఎమోషనల్ అయిపోయారు..... నన్ను కౌగిలించుకుని కాసేపు అట్లానే ఉండిపోయారు.
కాసేపటికి తేరుకొని 'బేటీ, సిద్ధూ చెప్పాడు నిన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్ళమన్నాడు. ఎవరో డాక్టర్ తో మాట్లాడారట. జస్ట్ ఇనిషియల్ చెకప్ కి తీసుకురమ్మన్నాడట. వెళ్దామా' అన్నారు.
నేను సరే అత్తమ్మా అన్నాను.
ఒక 20 నిమిషాలు డ్రైవ్ అనంతరం ఒక పెద్ద హాస్పిటల్‌కి వెళ్ళాము. చాలా ఖరీదైన హాస్పిటల్. హాస్పిటల్ ఎంట్రన్స్ లోనే మా కార్ కొరకు ఒక నర్స్ ఎదురు చూస్తోంది. మా కారుని చూడగానే మమ్మల్ని కారిడార్ లో రిసీవ్ చేసుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది.
(సశేషం)
No comments:
Post a Comment