చీర కట్టుకుంటావా? లేదా? (కథ)
నా పేరు దినేష్ .. నేను ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాను. నాకు 6వ తరగతి
చదువుతున్నప్పటి నుండీ అమ్మ బ్రాలు, జాకెట్లు రహస్యంగా తోడుక్కోవడం అలవాటు ..... ఆ
క్రాస్ డ్రెస్సింగ్ అలవాటు కాలక్రమేణా పెద్దదైపోయింది ఆన్లైన్ లో కాస్మెటిక్స్
హెయిర్ విగ్ కొనుక్కున్నా. నాన్న అమ్మ మాకున్న 2 ఫ్యాక్టరీలు చూసుకుంటూ ఉంటారు.
నేను అన్నయ్య అమ్మానాన్నకు సంతానం. అన్నయ్య పెళ్ళైపోయింది. తను అమెరికా లో సెటిల్
అయిపోయాడు. అమ్మ ఫ్యాక్టరీ కి వెళ్ళినప్పుడు నేను నాకున్న అలవాటు ప్రకారం అమ్మ
విడిచి పెట్టిన చీరల్లోకి మారిపోతూ ఉంటాను. ఇదండీ నా పరిచయ కార్యక్రమము.
ఆరోజు అమ్మ చాలా బిజీ గా
ఉంది. మహిళా పారిశ్రామిక వేత్తల సమావేశం ఏదో ఉందట. అమ్మ ఆర్గనైజ్ చేస్తోందట.
అందుకే అంత బిజీ గా ఉంది. పని మనిషి వచ్చి వెళ్ళిపోయింది. నేను అమ్మ ఎప్పుడు
వేల్లిపోతుండా అని ఎదురు చూస్తున్నాను. అమ్మ వండిన వంటల గురించి వివరంగా చెప్పి
తను కార్ తీసుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. కార్ దూరంగా వెళ్ళేంత వరకూ ఆగి
డోర్ లాక్ చేసేసి అమ్మ బెడ్రూంలోకి అడుగుపెట్టాను. అమ్మ బాత్రూం లో అమ్మ విడిచిన
చీరలు ఏమైనా ఉన్నాయేమో అని చూశాను. నైటీ, అడుగు లంగా మాత్రమే ఉన్నాయి టబ్ లొ.
బహుశా పని మనిషి బాటలు ఉతికి ఆరేసి ఉంటుంది. అమ్మ పాత చీరలు ఉండే అల్మైరా లో
చూసాను ... చిలకాకు పచ్చరంగు నేత చీర కనిపించింది. అమ్మ పాత జాకెట్లు నాకు
సరిపోతాయి. పైగా అమ్మ బిజినెస్ ఫీల్డ్ లో ఉందేమో చీరలు పాతగిలనివ్వదు. అందుకే పాత
చీరలు కూడా ఎప్పుడూ డ్రై క్లీన్ చేసి అల్మైరా లో పెడుతుంది. పాత చీర చూడదు కదా
.... ఈ రోజు కట్టుకున్నాక అమ్మకు తెలీకుండా డ్రై క్లీన్ చేయించి మళ్ళీ దాని ప్లేస్
లో పెట్టేయ వచ్చు అనుకుని లోలంగా, జాకెట్, చీర తీసుకుని నా రూం లోకి వెళ్లాను.
శుభ్రంగా శవె చేసుకుని, నా రేక్ లో నా బట్టల క్రింద దాచుకున్న బ్రా అండ్ పాంటి
తీసుకుని శుభ్రంగా స్నానం చేసి ముందుగా అండర్ గార్మెంట్స్ తొడుక్కుని అమ్మ లంగా
తీసి కట్టుకున్నాను. అమ్మ జాకెట్ తీసి నింపాదిగా తోడుక్కున్నాను. హుక్స్
పెట్టుకుంటుంటే నాలో ఏదో తెలియని ఆనందం ... లంగా జాకెట్ మీద అడ్డం ముందు నిలబడి
నన్ను నేను చూసుకున్నా ... నాకే ముద్దొచ్చింది. హెయిర్ విగ్ తీసి తలమీద ఫిక్స్
చేసుకుని ఆ తరువాత అమ్మ చీర తీసి కట్టుకున్నాను. అమ్మ డ్రెస్సింగ్ టేబుల్ లో ఉన్న
నగలు తీసుకుని గాజులు, అరవంకీలు, నెక్లెస్ ధరించాను ... కాళ్ళకు పట్టీలు
వేసుకున్నా. ఆ తరువాత ఇలాంత కలియ తిరిగాను. ఆకలి వేసి టిఫిన్ నాకు నేనే పెట్టుకుని
తిని కాసేపు టీవీ చూసాను. ఏది సినిమా వస్తోంది .. అది అయిపోయాక మల్లె లంచ్ కూడా
అయింది అనిపించి నా బెడ్ రూం లోకి వెళ్లాను ..... కన్నులు భారమనిపించి నెమ్మదిగా
అమ్మ చీరలోనే కొంచెం కునుకు తీద్దామని అట్లా కన్నులు మూసుకున్నాను ... నాకే తెలియ
కుండా గాడ నిద్ర పట్టేసింది . ఏదో అలికిడయ్యి కళ్ళు తెరచి చూస్తే ఇంట్లో ఎవరో
ఉన్నట్లున్నారు .....
టైం చూసేసరికి సాయంత్రం 4
గంటలు కావస్తోంది. అంటే అమ్మ వచ్చేసి ఉంటుంది . తన దగ్గర ఉన్న డూప్లికేట్ కీ తో
డోర్ ఓపెన్ చేసి లోపలి వచ్చినట్లుంది. నాకు ఒక్క క్షణం మైండ్ బ్లాంక్ అయిపోయింది
నేనింకా అమ్మ చీరలోనే ఉన్నాననే విషయం గుర్తుకు రాగానే!! అమ్మ నన్ను చూసి ఉండదు
.... అని తలుపు మూసేసి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుందామని న బెడ్ రూమ్ తలుపు వైపు
వెళ్దామనుకునే లోపల తలుపు కొంచెం తెరచి తొంగి చూచి అమ్మ నాతో "అమ్మా సుశీలా
నిద్రపోతున్నావని డిస్టర్బ్ చేయలేదు .... బెంగుళూరు లో ఉంటుంది నా ఫ్రెండ్ తను
వచ్చింది .... తనకు ఇల్లు చూపిద్దామని కొంచెం త్వరగా వచ్చేసాను .... లే కొంచెం
త్వరగా తయారు అవ్వు .... వాళ్ళని కొంచెం సిటీ చూపించడానికి కూడా తీసుకెళ్ళు అంది.
అమ్మ నన్ను చూసేసరికి చాలా సిగ్గనిపించింది .... మాటలు రాక అట్లానే నిలబడిపోయాను .
ఇంతలో తనే నీ అల్మైరాలో డ్రెస్ పెట్టాను చూడు అవి వేసుకో .... నీకు కాఫీ
పట్టుకొస్తా ... త్వరగా రావాలి గుడ్ గర్ల్ కదూ ... అంటూ తలుపు వేసింది. అంటే అమ్మ
అప్పటికి వచ్చి చాలాసేపు అయిందన్నమాట .... ఇంకా తను చెప్పాల్సినవి తను గడగడా
చెప్పేసి వెళ్ళిపోయింది. ఏమి చెయ్యాలో తెలియక కాసేపు అలానే ఉండి పోయా. ఏమైతే అది
అయింది అని అమ్మ అల్మైరాలో పెట్టిన డ్రెస్ చూసాను .... లైట్ లెమన్ యెల్లో కలర్
సల్వార్ .... క్రింద ఒక ప్యాడెడ్ బ్రా, హిప్ ఎన్లార్జర్ పాంటీ ఉన్నాయి ... ఆ
ప్రక్కనే కొన్ని బంగారు గాజులు, ఒక సన్నటి బంగారు చెయిన్ ఉన్నాయి బాత్రూం లోకి
వెళ్ళిపోయి చీర విప్పి మొత్తం డ్రెస్ అంత విప్పేసి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి అమ్మ
అల్మైరాలో పెట్టిన డ్రెస్ వేసుకున్నాను. ఇంతలో అమ్మ కాఫీ పట్టుకొచ్చింది ... లోపలి
వస్తూనే తలుపు మూసేసింది. అమ్మ నన్ను చొసి గుడ్ గర్ల్ ... ఈ డ్రెస్ లో చాలా
బాగున్నావ్ ... ముద్దొచ్చేస్తున్నావ్ అంటూ బుగ్గ చిదిమింది. నాకు ఒకటే వణుకు
...కష్టం మీద నోరు పెగుల్చుకుని "మమ్మీ! నన్ను క్షమించు .... ఇంకెప్పుడూ
ఇట్లా చెయ్యను" అంటూ అమ్మ చేతులు పట్టుకున్నాను. అమ్మ నెమ్మదిగా దినేష్! నేను
నా ఫ్రెండ్, వాళ్ళ అబ్బాయి కార్తీక్ వచ్చాము. ఎట్లాగూ మగాడివే కదా అని
నిద్రపోతున్నవేమో అనుకుని లోపలి వచ్చేసాము ... నిన్ను చూసేసరికి స్టన్ అయిపోయాను
... ఏం చెప్పాలో తెలీక "నిన్ను మా అక్క వాళ్ళ అమ్మాయి సుశీల అని చెప్పాను
.... ఏదో ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చావని చెప్పాను .... వాళ్ళు వెళ్ళే వరకూ
వాళ్ళతో అట్లానే బిహేవ్ చెయ్యి ... నాకు తెలుసు కాబట్టి నిన్ను పోల్చుకోగలిగాను
.... వాళ్ళు నిజమని నమ్మేశారు .... నువ్వు చేసిన పని మాకు తలవంపులు తేకూడదు ...
అట్లా చూసే బాధ్యత నీదే" అంటూ "త్వరగా బయటకు రా ... వాళ్ళు వెయిట్
చేస్తున్నారు" అంటూ బయటికి వెళ్ళిపోయింది ... నా అల్మైరా లో ఉన్న లిప్స్టిక్
నా పెదవులకు, సుర్వా నా కంటికీ అప్లై చేసుకుని పర్ఫెక్ట్ ఉన్నానని ఖాయం చేసుకుని
బయటకు వెళ్ళడానికి సందేహిస్తున్నాను . అంతలో అమ్మ సుశీ ! త్వరగా రా అమ్మా అంటూ
పిలవడంతో బయటకు వెళ్లాను ... హాల్లో ఒక మధ్యవయసు మహిళ , ఆమె ప్రక్కన 24 ఏళ్ళ
యువకుడు కూర్చుని ఉన్నారు. నేను బయటికి వెళ్ళగానే అమ్మ "ఇది మా సుశీల
కార్తీక్! ఏదో ఇంటర్వ్యూ ఉందంటే వచ్చింది ... మా దినేష్ గాడు ఎక్కడికి పోయాడో ...
సెలవు అంటే ఇంట్లో ఉండడు " అంటూ సుశీ ! తను కార్తీక్ ఇది వాళ్ళమ్మ వసుంధర .
కార్తీక్ మొన్ననే ఐ ఐ .ఎమ్ . అహ్మదాబాద్ లో ఎంబీఏ పూర్తి చేసి తన సొంత కంపెనీ
ఫ్లోట్ చేసాడు అంటూ తనని పరిచయం చేసింది. నేను వసుంధర గారికి నమస్తే చెప్పి ....
కార్తీక్ ని హలో అంటూ పలకరించాను.
తను నన్ను చాలా ఫాసినేటింగ్
గా చూడటం గమనించాను. కూర్చోండి సుశీలగారూ ... ఇంటర్వ్యూ యెట్లా చేసారు .... నేను
వెళ్ళేప్పుడు మీ సర్టిఫికెట్స్ ఇవ్వండి నాకు తెలిసిన లీడ్స్ ఏమైనా ఉన్నాయేమో
చూస్తాను అన్నాడు ... ఇంతలో అమ్మ "సుశీ! నేనూ ఆంటీ ఈవెనింగ్ సెషన్ కి
వెళ్ళాలి మీ అంకుల్ ఎల్లుండి గానీ రారు .... దినేష్ గాడికి ఫోన్ చేస్తే వాడేమో
వీకెండ్ కదా మమ్మీ మా ఫ్రెండ్స్ తో నాగార్జునసాగర్ వెళ్తున్నా అన్నాడు ....
ఈవెనింగ్ నీ బస్సు టికెట్ కాన్సిల్ చేసేసాను ... ఆంటీ వాళ్లకు కంపెనీ
ఇద్డువులే" అంటూ నా ప్రమేయం ఏమీ లేకుండా నే అన్నీ గడగడా చెప్పేసి
"కార్తీక్ కి కొంచెం కంపెనీ ఇవ్వు .... ఏదో షాపింగ్ ఉందట" అంది. నా
గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది ... కొంచెం గొంతు పెగుల్చుకుని "పిన్నీ
ఒక్క మాట" అంటూ నా రూమ్లోకి నడిచాను. అమ్మా ఇప్పటికే సిగ్గుతో
చచ్చిపోతున్నాను ... నాకు భయంగా ఉంది .... ప్లీజ్ నేను అతనితో వెళ్ళను అర్ధం
చేసుకో మమ్మీ అంటూ అమ్మను బ్రతిమాలడం మొదలుపెట్టాను. అమ్మ! దినేష్.... నువ్వు నా
చీరలు కట్టుకుంటున్నావనే విషయం నాకెప్పుడో తెలుసు .... మడతలు చెరిగి ఉన్నప్పుడే
అనుమానం వచ్చి నీ బీరువాలు నువ్వు లేనప్పుడు ఓపెన్ చేసి చూస్తే నీ బ్రాలు, పాంటీలు
అన్నీ చూశాను . నీ పరిస్థితి అర్ధం చేసుకున్నా కాబట్టే నువ్వు చీరలో ఉన్నా నిన్ను
అంగీకరించాను .... ఈ రెండు రోజులూ నేను చెప్పినట్లు చేస్తే నిన్ను సుశీలగా
అంగీకరిస్తాను లేకుంటే ఇంకెప్పుడూ ఇట్లా ఉండటం కుదరదు అని కరాకండి గా చెప్పేసింది.
అమ్మ చెప్పిన విషయాలు విని నిర్ఘాంతపోయాను. అమ్మ వెంటనే! నీకు ఈ డ్రెస్ కంఫర్ట్ గ
లేదు అనుకుంటా .... చీర ఒకటి ఇస్తాను .... అది కట్టుకో ..... తనతో మాత్రం షాపింగ్
కి వెళ్ళాల్సిందే ... అంటూ చీర కట్టుకుంటావా ? లేక దినేష్ గా ఉండిపోతావో నీ ఇష్టం
అంటూ మా బెడ్రూమ్స్ కి ఉన్న కనెక్టింగ్ డోర్ నుండి వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్లి
వైట్ మీద పిన్ కలర్ పూల డిజైన్ ఉన్న బెంగాలీ కాటన్ చీర, తెల్ల లోపలి లంగా, వైట్
బ్రా, క్రీం కలర్ ప్యాంటీ పట్టుకొచ్చి ఇచ్చింది . త్వరగా కట్టుకో ఆ అబ్బాయి వెయిట్
చేస్తున్నాడు అంటూ బయటికి వెళ్ళింది
అమ్మ చెప్పిన విధానం అన్నీ
ఆలోచించుకుంటే అమ్మ నన్ను ఒక ఆడదానిలా అంగీకరిస్తోంది అని అర్ధం అయ్యింది ... అదే
సమయంలో ఈ రెండు రోజులూ ఏదో ఒకలా అమ్మ చెప్పినట్లు గడిపేసి వాళ్ళు వెళ్ళిపోయాక
తరువాత చూసుకుందాం అమ్మ గౌరవాన్ని కాపాడాలి అనుకుంటూ అమ్మ నాకు ఇచ్చిన చీర
కట్టుకున్నా ... ఈ లోపు అమ్మ మల్లెపూల దండ ఒకటి పట్టుకొచ్చి నా జడలో అమర్చింది ..
నా హరి విగ్ కాస్ట్లీ ఏమో చాలా సహజమైన జడలానే ఉంది ..... తయారయ్యాక అద్దంలో
చూసుకుంటే నేనేనా అనిపించింది. ధైర్యంగా బయటికి వెళ్లాను ..... ఈ లోపు అమ్మ ఆంటీ
వాళ్ళు మీటింగ్ కి వెళ్ళడానికి బయలుదేరిపోయారు. నేనూ, కార్తీక్ వేరే కారులో
షాపింగ్ కి బయలుదేరాము. కార్తీక్ డ్రైవ్ చేస్తున్నాడు .... నన్ను ఆరాధ్యభావనతో
చూడటం నేను గమనించాను .... తను నన్ను పొగుడుతూ, తనగురించి చెప్తూ మధ్యలో
"సుశీల! నేను కొంచెం షాపింగ్ చెయ్యాలి .... లేడీస్ అండ్ జెంట్స్ కి ఎక్కడ
బాగుంటాయో చెప్పండి" అని అడిగాడు. నేను అమీర్పేట చందన షోరూం కి తీసుకు
వెళ్లాను. తను యేవో రెండు డ్రెస్ లు తీసుకుని .... మా చెల్లి మీకు లానే ఉంటుంది
... కొంచెం తనకి మీ టేస్ట్ తో 4 శారీస్, 4 సల్వార్స్ సెలెక్ట్ చెయ్యండి సుశీలా అని
అడిగాడు. నేను "నాకు ఇవేమీ తెలియవు కార్తీక్ ఏదో అమ్మా వాళ్ళు సెలెక్ట్ చేసే
డ్రెస్సెస్ వేసుకుంటాను" అన్నాను . "సుశీలా!! మీ ఏజ్ అమ్మాయిలు మోడరన్
గా తయారవుతున్నా ఇంకా చీరలే కడుతున్నారు మీరు .... అది నాకు నచ్చింది .... చీరలో
చాలా అందంగా ఉన్నారు మీరు ... మీరు మీకోసమే అనుకుని సెలెక్ట్ చెయ్యండి అవే ఇస్తాను
మా చెల్లికి" అన్నాడు కార్తీక్. నేను రెండు బెంగాలీ కాటన్ శారీస్, రెండు
చెట్టినాడ్ సిల్క్ శారీస్, ఒక నాలుగు సల్వార్ డ్రెస్ లు, రెండు పటియాలా డ్రెస్ లు
నేను వేసుకుంటే యెట్లా ఉంటాయో అని ఆలోచిస్తూనే సెలెక్ట్ చేసాను ...ఈ లోపు తను
ముందుకు వెళ్లి యేవో బాగ్స్ తో వచ్చాడు ... నేను తనకోసం ఏమైనా కొనుక్కున్నాడేమో
అనుకున్నాను .... ప్రక్కనే ఉన్న హోటల్ లో కాఫీ తాగి ఇంటికి బయలుదేరాము .... ఇంటికి
వెళ్లేసరికి అమ్మ ఫోన్ "రావడం లేట్ అవుతుంది.... డిన్నర్ కి వాళ్ళు వచ్చాక
వెళ్ళవచ్చని"
కార్తీక్ గెస్ట్ బెడ్ రూమ్
లోకి వెళ్ళిపోయాడు .... నేను తనకు ఏమైనా త్రాగడానికి ఇస్తే బాగుంటుందని అనిపించి
ఫ్రిజ్ లో ఉన్న మిల్క్ షేక్ గాజు గ్లాస్ లో పోసి పట్టుకెళ్ళాను.... తను స్నానం
చేసి ఫ్రెష్ అయిపోయి క్యాసువల్ డ్రెస్ లో ఉన్నాడు ... తనకు ఒక గ్లాస్ ఇచ్చి నేనూ
త్రాగడం మొదలు పెట్టాను .... తను త్రాగడం అయిన వెంటనే గ్లాస్ లు తీసుకుని బయటకు
వెళ్లబోతుంటే "సుశీలా! ఒక్క నిమిషం అంటూ తను షాపింగ్ చేసినా బాగ్స్ నాకు
ఇవ్వబోయాడు ... నేను ఆశ్చర్యంగా చూస్తుంటే "ఏమీ అనుకోకపోతే ఈవెనింగ్
మిమ్మల్ని చీరలో చూడగానే ఎప్పుడో మీతో పరిచయం ఉన్నట్లూ .... మీరు నాకోసమే ఉన్నట్లూ
అనిపించింది ... నేను మీకు డ్రెస్సెస్ కొందామనిపించి మా చెల్లి వంక పెట్టాను ....
నాకు చెల్లెళ్ళు ఎవరూ లేరు .... మీరు అపార్ధం చేసుకుంటారేమో అని ముందే ఆంటీ
పర్మిషన్ తీసుకున్నాను ... కాదనకండి" అంటూ నా చేతిలో పెట్టేసాడు. అమ్మ పేరు
చెప్పాకా ఇంకేమంటాను ? థాంక్స్ అండీ అని చెప్పి నా రూమ్లోకి వెళ్ళిపోయాను ....
సాయంత్రం నుండి జరుగుతున్న సంఘటనలు గుర్తొచ్చి నా మనసులో ఏదో తెలియని తీపి
అనుభూతులు ... ఒక ప్రక్క కార్తీక్ కి నేను మగాడిని అనే విషయం తెలిసిపోతుందేమో అనే
భయం ..... స్నానం చేసి బట్టలు మార్చుకుందామనుకుంటే నాకు డ్రెస్సెస్ లేవు. అమ్మ
డ్రెస్సెస్ తీసుకుందామనుకుంటే ఏదో భయం ... అట్లానే ఒక 30 నిమిషాలు గడిచేసరికి అమ్మ
వచ్చేసింది. అమ్మకు నాపరిస్తితి అర్ధం అయిందనుకుంటా .... రెండు రెడీమేడ్ కాటన్
పంజాబీ డ్రెస్ లు పట్టుకొచ్చింది తన వెంట. నాకు ఇచ్చి నాతో ఇక పాంట్స్ షర్ట్స్
అన్నీ బంద్ ... నేకు చీరలో, ఈ డ్రెస్సులే కొంటాను అంటూ నవ్వుతూ అని త్వరగా తయారవ్వు
... ఆకలేస్తుంది .... వాళ్ళను హోటల్ కి తీసుకెళ్ళాలి అంటూ తనూ సిద్ధపడటానికి
వెళ్ళింది. నారింజ రంగు పూల డిజైన్ ఉన్న పంజాబీ డ్రెస్ అది ... వైట్ లోయర్ .....
చున్నీ తో ఉంది అదే బాగ్ లో బ్రా, ప్యాంటీలు కూడా ఉన్నాయి. త్వరగా తయారై ఆ డ్రెస్
వేసుకున్నాను. బయటికి వచ్చేసరికే అందరూ రెడీ గా ఉన్నారు. హోటల్ కి వెళ్ళాము ...
అది ఒక 5 స్టార్ హోటల్ ... అమ్మ ముందే టేబుల్ రిజర్వు చేసినట్లుంది .... డిన్నర్
చేస్తున్న సమయంలో వసుంధర ఆంటీ నాతో చాలా కలివిడిగా మాట్లాడింది .... అమ్మతో
"ఈ పిల్లని నాకోడలిగా చేసుకుంటానే! వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఇవ్వు లేదా
నువ్వే మాట్లాడు." అంది. అమ్మ "నేను మాట్లాడుతాలే" అంది. నాకు
అన్నం తింటుంటే పోలమారిపోయింది. అమ్మ పెళ్లి మాట వచ్చేసరికి చూడు యెట్లా
అయిపోయిందో అంటూ మంచి నీళ్ళ గ్లాస్ అందించింది ... నాకేమో కార్తీక్ వైపు చూడలేని
పరిస్థితి. ఆ గంట సమయం ఎంత భారంగా గడిచిందో ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది.
ఇంటికి వెళ్ళాక అమ్మ ఒక
కాటన్ నైటీ ఇచ్చింది. లోపల పెట్టీ కోట్ సరేసరి. ఇంటికి వెళ్ళగానే డ్రెస్
మార్చుకుని నైటీ వేసుకున్నాను .... లోపలి ప్యాడెడ్ బ్రా నైటీ మీద ఎంతో ఆకర్షణీయంగా
చూపిస్తోంది నా ఆకృతిని. అమ్మ ఈ లోపు విరజాజి పూలు తీసుకొచ్చి నా జడలో తురిమింది.
ఇవన్నీ తలచుకుంటుంటే నాకు నిద్ర పట్టడం లేదు .... నా బెడ్ రూం కి ఆనుకొని ఉన్న
బాల్కనీ లోకి వెళ్లాను ... చల్లగాలి వేస్తోంది. కాసేపు అట్లా నించున్నానో లేదో నా
వెనుక ఎవరో నిలబడినట్లనిపించి చూస్తే కార్తీక్ .... ఆ ఏకాంత సమయంలో నాలో తడబాటు
... మాటల్లేవు ... కాసేపు గడిచాక "అమ్మ చెప్పిన విషయం మీకు సమ్మతమేనా
సుశీలా?" అని మంద్ర స్థాయిలో అడిగాడు కార్తీక్ .... నాకు మాట్లాడటానికి
ధైర్యం సరిపోవడం లేదు. ఎక్కడ నిజం బయట పడిపోతుందో అని. వెంటనే కార్తీక్ "మీ
అమ్మగారు అన్నీ చెప్పారు .... నువ్వేమీ అబద్ధం ఆడటం లేదు .. మోసం చెయ్యలేదు .....
నీ బలహీనతను నేను గౌరవిస్తున్నాను .... నీకిష్టమైతే నువ్వు స్త్రీగా మారేందుకు
నీకు నేను తోడుంటాను..... అంటూ ముందుకు జరిగి నన్ను కౌగలించుకుని నా నుదుటి మీద
చుంబించాడు .... నాకు ఇది కలా నిజమా అర్ధం కావడం లేదు ...... తన పెదవుల స్పర్శ ఇది
నిజమని నాకు చెప్తోంది..... నేనూ తనకు అనువుగా స్పందించడం మొదలుపెట్టాను .... మా
ఇద్దరి పెదవులూ కలిసి సంభాషణ మొదలుపెట్టాయి .... మా ఇద్దరి లాలాజలాలూ కావాల్సిన
కరెంట్ ను ఉత్పత్తి చేయడం మొదలెట్టాయి. నన్ను కౌగలించుకుని అట్లానే ఉన్నాడు .....
కాసేపటికి నేనే తేరుకుని "కార్తీక్! థాంక్ యూ వెరీ మచ్..... అమ్మ నాకు
మిమ్మల్ని బహుమతి గా ఇస్తుంటే వద్దని నేను చెప్పలేను .... కానీ నేను రేపు అమ్మతో
మాట్లాడాక నా జవాబు చెప్తాను. నన్ను అర్ధం చేసుకోండి" అన్నాను. తను సరేనని
"గుడ్ నైట్" చెప్పి వెళ్ళిపోయాడు.
నాకు ఇది కలా నిజమా
అనిపిస్తోంది. వెంటనే అమ్మ బెడ్ రూమ్ తలుపు తట్టాను ... అమ్మ తలుపు తీసింది ....
ఏమిటిరా ఇంకా నిద్రపోలేదా?" అని లాలనగా అడిగింది. అమ్మా! కార్తీక్ కి అంతా
చెప్పేసావా? తను నన్ను అడిగాడు అన్నాను .... అమ్మ కాసేపు ఆగి నింపాదిగా చెప్పడం
మొదలుపెట్టింది "నీకు ఈ క్రాస్ డ్రెస్సింగ్ అలవాటు ఉన్నట్లు నాకెప్పుడో
తెలుసు చిన్నా ..... నిన్ను నిలదీస్తే ఏమైనా అఘాయిత్యం చేసుకుంటావేమో అనే భయంతో
ఇప్పటివరకూ మాట్లాడలేదు. ఒక వేల రేపు నీకు పెళ్లి చేశామే అనుకో నీకున్న ఈ
డ్రెస్సింగ్ అలవాటు వచ్చే అమ్మాయికి తెలిస్తే నిన్ను మమ్మల్ని అల్లరి చేసి వెళ్లి
పోవచ్చేమో? మధ్యాహ్నం నిన్ను చూసిన వెంటనే నువ్వు సహజమైన ఆడపిల్లవు అనుకుని నిన్ను
ఇష్టపడుతున్నట్లు చెప్పాడు కార్తీక్ . అప్పుడు తనకు ఉన్న నిజం చెప్పేసాను. వసుంధర,
కార్తీక్ నిన్ను ఇష్టపడుతున్నామని నాకిష్టమైతే నిన్ను స్త్రీగా మారిన తరువాతే
పెల్లిచేసుకుంటాననీ చెప్పాకే చాలా సేపు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ
నాన్నతో మాట్లాడుతా నీకిష్టమైతే. ఒక వేళ నీకిష్టం లేదనుకో. ఇంతటితో మర్చిపోదాం. ఇక
భవిష్యత్తులో నువ్వు చీర కూడా కట్టకూడదు. చీరలో నే ఉంటానంటే నేను చెప్పినట్లు
చెయ్యి. లేదంటే ఇంకా ఈ విషయం మర్చిపో అంది అమ్మ "
నేను అమ్మా! నాగురించి ఇంత
ఆలోచించావు .... నీకడుపున పుట్టడం నా అద్రుష్టం అమ్మా! రేపు మన చుట్టుప్రక్కల
వాళ్ళు ఏమనుకుంటారు? నన్ను చులకనగా చూస్తారేమో? అన్నాను.
అమ్మ "ఎవరు చూస్తారు
రా? వాళ్ళ తిండేమన్న తింటున్నామా మనం? మాకు కావలసింది నువ్వు ఆనందం గా ఉండటం ....
నాకు కూడా కూతురు లేదనే లోటు ఉండేది ఇంతవరకూ .... నీకిష్టమా కాదా చెప్పు. తరువాత
విషయాలన్నీ నేను చూసుకుంటా" అంది.
అమ్మ ను గాడంగా కౌగలించుకుని
అమ్మా! నేను ఇక నీ సుశీలని .... నువ్వు నాకిస్తున్న పునర్జన్మ అమ్మా ఇది ... అంటూ
ఏడ్చేసాను. అమ్మ"పిచ్చీ! ఏమిటిరా ఇది మిమ్మల్ని అర్ధం చేసుకోవడానికే కదా మేము
ఉన్నది .... నా కొడుక్కి ఏ పనీ నేర్పలేకపోయాను .... రేపు నా కూతురిని అత్తారింటికి
పంపేటప్పుడు అన్నీ నేర్పాలి ... రేపటినుండి ఇంట్లో పని మనిషిని
మాన్పించేస్తున్నాను.... ఇంటి పనీ, వంట పనీ అన్నీ నేర్చుకోవాలి సరేనా1 అంది.
ఆ తరువాత అమ్మ నాన్నను
యెట్లా వప్పించిందో తెలియదు కానీ నాన్న, అన్నయ్య, వదినా అందరూ ఈ దినేష్ సుశీలగా
మారడానికి వప్పుకున్నారు. కార్హీక్ నాకెంతో అండగా నిలిచాడు. అమ్మకు చీరలో
దొరికిపోయిన తరువాత నాన్నకోసం నాన్న వప్పుకునేంత వరకూ తప్పించి ఎప్పుడూ నేను
స్త్రీ లానే వున్నాను .... కార్తీక్ నన్ను ప్రపోజ్ చేసిన 10 నెలలకు థాయిలాండ్
వెళ్లి సుశీల రూపాన్ని సంతరించుకుని వచ్చాక మా పెళ్ళైపోవడం .... నేను అత్తవారింట
అడుగు పెట్టడం అన్నీ జరిగిపోయాయి .... మా పెళ్ళైన తరువాత తెలిసింది కార్తీక్ కి
అంతకు ముందే పెళ్లి అయిందనీ పాప ఉందని ... కనీ తన మొదటి భార్య పాప కు జన్మ ఇచ్చే
సమయంలోనే చనిపోయిందనీ, ఈ విషయం మా వాళ్ళందరికీ తెలుసనీ. పాపకు ఇప్పుడు రెండేళ్ళు
... నన్ను అమ్మ అని పిలుస్తుంది .... నాతోనే ఉంటుంది ..... కార్తీక్ నన్నెంతగా
ప్రేమిస్తాడో ..... కంపెనీ నుండి రావడం ఇంట్లోనే ఉంటాడు ..... తనకు మాతోనే జీవితం
.... నాకు పాప, కార్తీకే జీవితం
(సమాప్తం)
No comments:
Post a Comment