ఈ కధ "మజిలీ" నీలిమ చే వ్రాయబడిన కధ. అసంపూర్తిగా ఉంటే పూర్తిచేద్దామని అనుకుంటున్నాను. మీ కామెంట్స్ తో నన్ను ప్రోత్సహించగలరు.
మజిలీ :
అన్నీ అనుకున్నట్లు జరిగితే అది జీవితం
ఎందుకు అవుతుంది?. రీసెంటుగా వచ్చిన సినిమా లో చెప్పినట్టు "ఏ మనిషికి ఏ మజిలీయో"
అన్నట్టు నా మజిలీ నాకు కూడా దొరికింది .
ఎన్నో కథలు చెప్పిన మీకు నా కథ చెప్పాలన్న
చిన్న ఆశే.. ఈ నా కథ.... మరిక ఆలస్యమెందుకు? చదివేయండి ......
ఐదు ఏళ్ళ క్రితం:
ప్రస్తుతం:
అక్కకి దగ్గరగా ఉంటే మంచిదని నన్ను కూడా బెంగళూరు షిఫ్ట్ అవమన్నారు నాన్న. నేనెక్కడా పేరెంట్స్ ఇక్కడ ఎందుకని అమ్మా, నాన్న
కూడా నాతోనే ఉంటున్నారు. మా ఫ్యామిలీ బెంగళూరు షిఫ్ట్ అయ్యాం. ఇప్పుడు అక్క నేను ఒకే అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాం. ఇంటి అప్పులు కూడా
తీరిపోయాయి, నాకు వచ్చిన కట్నం వల్లే అది కూడా. కానీ ఈ 5 ఏళ్ళు చాలా మార్పులు చూశాయి
నాలో. ఇందాక అన్నట్టు అన్ని అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతది. పెళ్లి
చేసుకుని కోడల్ని ఇంటికి తెచ్చుకుందామనుకున్న మా అమ్మ నాన్నే కాళ్ళు కడిగి నన్ను కన్యా
దానం చేసి, నన్నే ఒక ఇంటికి కోడలిగా పంపారు. మీకు ఎంత మంది అని మా పేరెంట్స్ ని అడిగితే
ఒక పాప, ఒక బాబు అని చెప్పడం నుండి, మాకు ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పడం మొదలు పెట్టారు.
వీటికి కారణం నా మజిలీ.
ఆ మజిలీ పేరు సిద్ధార్థ్ . నా పేరు నీలిమ సిద్ధార్థ్ . ఇదీ నా కథ.
చెప్పమంటారా ?
మా నాన్న కోపంతో "ఏం? వేళాకోళంగా ఉందా మేమంటే? పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు.
మా వాడు ఏమన్నా ఆడంగి అనుకున్నావా? " అని తిట్టి పంపేశారు. కానీ ఆ పంతులు గారు
పట్టు వదలని విక్రమార్కునిలా వస్తూనే ఉన్నారట. ఈ తంతు కొన్ని నెలలు సాగింది . కానీ
ఇవేమి మా అక్కకు కానీ నాకు కానీ తెలియదు.
నాకు తెలిసిన కొద్దిరోజులకి '... మా అక్క మామూలుగానే ఇంటికి కాల్ చేసి అమ్మ నాన్న
తో మాట్లాడి నాతో లైన్లో ఉంది.
ఫోన్లో :
అక్క: ఏరా, ఎలా ఉన్నావ్?
నేను: బాగానే ఉన్నానులే అక్కా, నీకంతా తెలిసిందే కదా.... ఏమంత కొత్తగా ఉంటుంది చెప్పు.
అక్క: ఎందుకు ఉండదు, సంబంధాలు వస్తున్నాయంట, ఎవరికో నువ్వు బాగా నచ్చావట. సంగతేమిటి?
నాకు చెప్పనే లేదు.
ఓకే చెప్పేస్తావా ఆ అమ్మాయికి ? ఆడపడుచుని అర్ధమొగుడిని అసలు నన్ను అడక్కుండా
ఏంటి ఇది?
నేను: నీకు ఆలా అర్థమైందా మహాతల్లీ!! సంతోషం !!!
అక్క: అదేంట్రా! అట్లా అంటున్నావు. పెద్ద ఇంటి సంబంధం అన్నారు. కట్నం కూడా ఇస్తామంటున్నారట.
బాగోలేదా అమ్మాయి?
నేను: నీ ఎంకమ్మ, !! ఇచ్చేది కట్నం కాదు.
అక్క: మరి ????
నేను: ఎదురు కట్నం !!!!!
అక్క: ఏంటి ? అంటే ? అదెలా ? అర్ధం కావడంలేదు సరిగా చెప్పు.
నేను: ఆపు ఇంకా. నాకు అవే డౌట్స్. అందుకే మూడు రోజులుగా ఇంటికే వెళ్ళలేదు .
అక్క: దేవుడా !!! ఒరేయ్ . మూసుకుని ముందు ఇంటికి వెళ్ళు.
నేను: ఆ ….. సరే లే.
అక్క: రేయ్. ఆపు నువ్వు.
అమ్మానాన్నా సైలెంటుగా ఉన్నారు. కాసేపటికి
....
నాన్న: ఒరేయ్ , నీకు తెలియనిది కాదు, మన పరిస్థితి బాలేదు అని. ఈ టైంలో మనకి ఒక
అవకాశం వచ్చింది .
నేను: ఏంటి నాన్నా అది.
నాన్న: నీ పెళ్లిరా.
నేను: ఓహో ... వచ్చే కట్నంతో అప్పు లేపేద్దామనా మీ ఐడియా?
నాన్న: ఇంచుమించు అదేరా. కానీ, నీకు అంగీకరమైతేనే ....
నేను: హహ, అదేంటి డాడీ. డబ్బులు వస్తుంటే ఎవరు వద్దంటారు?
నాకు ఓకే.... డబ్బులిచ్చే ఏ సంబంధం అయినా!
నాన్న : ఒరేయ్, ఇక్కడే చిక్కొచ్చిపడిందిరా!!
నేను: అంటే ?
అక్క: అంటే, అది. మ్మ్ !!! ఎలా చెప్పాలి !!!
నేను: నీ లవ్ మేటర్ ఎలా చెప్పావో , అలానే చెప్పు ఓవర్ యాక్షన్ చేయకుండా !!!
అక్క: నిన్ను వాళ్ళ ఇంటి .......
నేను: ఆ ఇంటి ???
అక్క: వాళ్ళ ఇంటి కోడలిగా చేసుకుందాం అనుకుంటున్నారురా !!!
నేను: వాట్ ది ఫక్ !!!!
అక్క: మ్మ్.. అందుకే ఈ ఎదురు కట్నం కూడా !
నాకు తల తిరుగుతుంది అక్కా. ఆ పిల్ల ఏం
పిల్ల అక్కా. నన్ను పెళ్లి చేసుకుని తాను భర్తలాగా ఉందామనా ? ఆలా ఎలా సాధ్యం
చెప్పు ?? !! ఎవరు ఆవిడ . అసలు ఆ అమ్మాయి పేరేంటి ! ఏంటి ఈ విచిత్రమైన కోరికలు.
అక్క: ఓహో, నీకు ఇంకా మొత్తం తెలిసినట్టు లేదు. నీకు వచ్చింది అమ్మాయి సంబంధం
కాదు. అబ్బాయిది . పేరు అడిగావు కదా. సిద్ధార్థ్ !
"అరేయ్, ముందు ఈ వాటర్ తాగు. కూల్ అవ్వు. టెన్షన్ తీస్కోకు. మాటలే కదా ఇంకా
నడుస్తున్నాయి. నీకు ఇష్టం లేకుండా చేస్తారా ఏంటి చెప్పు నీ పెళ్లి?".
సో.... వాళ్ళ అమ్మగారు నాన్నకి కాల్ చేసారు.
మాట్లాడారు. మన పొజిషన్ ఏంటి అని. నువ్వు ఈ పెళ్లి కి ఓకే అంటే, నిన్ను అమ్మాయిగానే
వాళ్ళ ఇంటికి తీసుకెళతాం అన్నారు. వాళ్ళబ్బాయి గే అని తెలిస్తే వాళ్ళ కమ్యూనిటీ లో
పరువు పోతుందని వాళ్ళ భయం. ఇక్కడే ఉంటే మనం కూడా ఇబ్బంది పడతాం కదా, అందుకే వేరే ఊరు
కంప్లీట్ గా మారిపోదామంటున్నారు. కానీ ఇవన్నీ నీకు నచ్చితేనే. అతనితో నేను మాట్లాడాను.
కనీసం పెళ్లి చూపులు వరకు కానీయండి, నచ్చకపోతే పెళ్ళికి బలవంతమేమీ లేదు అంటున్నాడు
".
సరే అక్కా! ఎప్పుడు పెళ్లి చూపులు?" అని అడిగాను.
"అబ్బా, సూపర్ రా నువ్వు. వెరీ గుడ్ డెసిషన్ . ఉండు ఇంట్లో చెప్పొస్తా
!!" అంది. చిన్నగా నవ్వాను.
వాళ్ళ పంతులుగారితో మాట్లాడి, మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులు పెట్టుకున్నారు.
ఈవెనింగ్ ముహూర్తం.
పెళ్లి చూపుల రోజు:
మా అమ్మ "అరేయ్ లేవరా !"
"ఏంటమ్మా! పొద్దున్నే ?? "
"మర్చిపోయావా ? ఇవ్వాళ నీ పెళ్లి చూపులు "
"ఓ !!.. మ్మ్ లేస్తున్నా "
"ఓ మ్మ్ ఏంట్రా. మంచిగా తయారు అవ్వు . అక్క కూడా ఉంది హాల్ లో ".
అర్ధం కాకుండానే నిద్ర మత్తులో హాల్ లో కి వచ్చా.
"హాయ్ రా, గుడ్ మార్నింగ్."
"ఏంటి, నీకు పని లేదా? అసలు మీ అత్తగారింట్లో ఉండకుండా ఎప్పుడూ ఇక్కడే ఉంటావు"
అని వెటకారం చేసాను.
"ఏడిశావు లే . ఇవ్వాళ నీ పెళ్లి చూపులు . మీ అత్తగారు వాళ్ళు వస్తున్నారు
చూసుకో . అసలే వాళ్లకి కట్టుబాటలు చాలా ఎక్కువ "
"అయితే ఎవడికే ?"
"నీకే ఎక్కువ! ప్చ్... ఇప్పుడు తమరు
మరి రెడీ అవ్వాలి కదా చీర కట్టుకుని !!"
"వేళాకోళం గా ఉందా ??? నేనేంటి , చీర ఏంటి !"
"తప్పదు రా ! ఈ ఒక్క సారికే . వాళ్ళ ఫ్యామిలీలో కొంత మంది వస్తున్నారు అంట. అనుమానం రాకూడదు అని."
"ఓ గాడ్ !! " ........
టిఫిన్ చేశాక, అక్క నేను రూమ్ లో కి వెళ్ళాం .క్లీన్ షేవ్ చేసుకుని వచ్చాను .
"అరేయ్ , ఈ ఒక్క రోజు ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పింది విను . సరే నా
?"
"తప్పుతుందా, ఈ ఒక్క రోజే !! ఒకే ఒక్క రోజు !!"
షేవ్ చేసుకుని వచ్చాక, నా అండర్వేర్ వేసుకున్న. అక్క ఒక బ్రా ఫిట్ చేసింది . బీరువా
నుండి అమ్మ సిల్క్ చీర ఒకటి తీసింది . కనకాంబరం
రంగు . బ్లౌజ్ వేసుకోడంలో హెల్ప్ చేసింది. కాటన్ లంగా ఇచ్చి తలపై నుండి వేసుకో అంటే.
"ఇది అవసరమా ?" అన్నాను . "నీకు చీర కట్టుకోడం వస్తే కట్టుకుని రా.
నేను బయట ఉంటాను " అంది . మా అక్క సైలెంట్ అయ్యాను.
లంగాని పై నుండి వేసి నడుము దగ్గర ముడి వేసింది. చీర ని మొత్తం ఓపెన్ చేసి ముందు
నడుము దగ్గర కట్టి, పల్లు సరిచేసి పిన్ పెట్టింది. కుచ్చిళ్ళు నెక్స్ట్ కదా, అవి కూడా
వేసింది.
సైలెంట్ గా చూస్తూ ఉన్న.
"బాగానే కట్టించుకున్నావు రా చీర. ఎలా అనిపిస్తుంది"
"చంపుతా "
"సరే లే ! ఇలా రా కూర్చో ."
డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మిర్రర్ లో చూస్తున్న . అక్క వెనకనుండి ఒక
విగ్ పెట్టింది . సింగిల్ జడ వేసింది. జడ వేసి నా భుజం మీద పెట్టింది. "ఇదిగో
రా , నీ జడ ... పీపీ" అంటూ .
"ఆట పట్టించకు అక్కా, ఏదోలా ఉంది !! " అని బాధ గా పెట్టాను.
అక్క నా బాధ చూసి "చెప్పాను కద రా. ఈ ఒక్క రోజే. డ్రామా అనుకో పోనీ. ప్రెషర్
ఫీల్ అవ్వకు. నీ లానే ఉండు . సిద్ధార్థ్ మంచోడే అని విన్నాను"
మళ్ళీ కోపంగా చూస్తే అక్క నవ్వింది .
ఛిల్ రా ... అంటూ.
జడ వెనక్కి వేసుకున్నాను. అక్క నవ్వుతూ జడలో
పూలు పెట్టింది. ఆ పూల సువాసనతో గదంతా వ్యాపించింది
గాజులు చేతికి 6 వేసింది . పాపిట బిళ్ళ పెట్టింది . పట్టీలు వేసింది, చెవికి కమ్మలు
పెట్టింది. అమ్మవి కమ్మలు .
మెడలో హారం వేసింది .
హాల్ లో ఈ పాటికే అందరూ ఉన్నారు. నేను వెళ్లి వచ్చిన వాళ్ళ ముందు నాకొరకు వేసి
ఉంచిన కుర్చీలో కూర్చున్నాను. తల ఎత్తడానికి కూడా ఏదోలా ఉంది. సిగ్గుతో చచ్చిపోయినట్లుంది.
చాలా వింతగా అనిపించింది. ఏమిటీ ఇదంతా అని.
ఒకే ఒక్కసారే కదా ఏమైతే అది అవుతుందిలే అని అనుకోగానే కొంచెం ధైర్యం వచ్చింది. వాళ్ళు
ఎం మాట్లాడుతున్నారో నాకు ఏమి మైండ్ లో కి వెళ్లడం లేదు. అంతా గోల గోల గా ఉంది.
ఆ సిద్ధార్ద్ అనే వింత మానవుడు ఎవరా అని కొంచెం కొంచెంగా కళ్లు ఎత్తి చూశాను కనపడ్డాడు. సినిమా హీరోలా ఉన్నాడు. హ్యాండ్సమ్ మ్యాన్
!!! ఇతను గే ఏంటో అనుకున్నాను. పాపం వీడి పెర్సనాలిటీని కి పడిపోయిన అమ్మాయిలు ఎంత
బాధ పడ్డారో అని నవ్వొచ్చింది. కిందకి చూస్తూ , నా గెటప్ చూసుకుని ఇదంతా ఏంటో అనుకుంటూ
ఆలోచనలో ఉండగా సడన్ గా అక్క పిలిచింది. ఒక్కసారిగా
మళ్ళీ ఈ లోకం లో కి వచ్చాను.
"ఏంటక్కా ?"
"అతనితో మాట్లాడవా ? డాబా మీద ఉంటా అని వెళ్ళాడు. గో.... గో....
. వెళ్లి మాట్లాడు "
"తప్పదా ?" అంటూ తనవైపు నెర్వస్ గా చూసాను.
"వద్దు లే, ఇప్పుడే ఖాయం చేసుకుందాం సంబంధం . సరే నా?"
"నీ ఎంకమ్మ . ఏదోలా ఉందే. "
"ఏం పర్లేదు. నువ్వు నువ్వులా ఉండు
అటున్నాను కదా. ప్రెషర్ తీస్కోకు."
సరే అని నెమ్మదిగా లేచి డాబా మెట్లెక్కి పైకి వెళ్లాను.
.....
ఒక గంట అయ్యాక :
ఇద్దరం కిందకి వచ్చాము. సిద్ధార్ధ్ వాళ్ళు వెళ్లిపోతున్నారు. మేము కూడా గేట్ వరకు
వెళ్ళాము. సిద్ధార్ధ్ సడన్ గా వెనక్కి తిరిగి చెయ్యెత్తి బై అని చెప్పాడు. నేను కూడా సిగ్గుతో బై అన్నాను.
వాళ్ళు వెళ్లిపోయారు
మా ఇంట్లో కి అక్క పరుగెత్తుకుంటూ వచ్చి
...
"సో ?" అంది.
నేను కూడా బదులుగా "సో ??? " అని చిన్నగా నవ్వాను.
"చెప్పు, ఏంటి నీ సంగతి మరి " అని అడిగింది అక్క. అమ్మానాన్న కూడా పక్కనే ఉన్నారు .
నవ్వుతూ సిగ్గుతో కిందకి చూస్తూ, "నాకు ఓకే !!" అని చెప్పేసాను.
అమ్మ నాన్న ఒక్కసారిగా సంతోషం లో మునిగారు. అక్క అయితే షాక్ లో ఉండిపోయింది.
"నువ్వేనా ? పెళ్లికి ఓకే నా? అబ్బాయితో పెళ్లి ! ఆ ఆఇంటికి కోడలు గా వెళ్ళాలి,
అమ్మాయిలా చీరలుకట్టుకోవాలి. ఇవన్నీ ఆలోచించావా ??"
బదులుగా మెల్లిగా పైకి చూస్తూ నవ్వుతూ
ఓకే అన్నట్లు తల ఊపాను .
అక్క ఒక్కసారిగా కౌగిలించుకొంది. నేను కూడా నవ్వుతూ సిగ్గు పడ్డాను.
అమ్మ "సంతోషంగా ఉంది రా . ఉండు నీ నోరు తీపి చేయాలి" అని స్వీట్స్ కోసం
కిచెన్ లో కి వెళ్ళింది.
అక్క "అమ్మా! నోరు తీపి చేస్తారా కాదు చేస్తానే అనాలి ఇకనుండి"
"కదే" ఏమిటి క్రొత్తగా అన్నాను.
"నిన్ను అలాగే పిలవాలిగా ఇకనుండి.... హ హ హ "
"పోవే " అని సిగ్గు పడ్డాను. ఇద్దరం నవ్వుకున్నాము.
అదంతా కాదు కానీ . అసలు ఏం మాట్లాడుకున్నారు పైన. అట్లా వెంటనే ఒప్పేసుకున్నావు
ఏంటి.? అసలు ఒప్పుకోవు అనుకున్న. ఏమైందే ??
చెప్పు... ఇకనుండి అక్కాచెల్లెళ్ళం కదా మనం! చెప్పవే చెల్లీ"
ఇంతలో అమ్మ కూడా రానే వచ్చింది.
"ఏమిటే నువ్వు? కొంచెం కూడా సాయం చెయ్యకుండా తమ్ముడితో ముచ్చట్లు పెడుతున్నావు.
వంటిట్లో ఒక్క దాన్నే ఎన్ని పనులని చేసుకోవాలి? ".అని అక్కతో ఆంటూంటే....
అక్క అమ్మను ఆపుతూ "హలో అమ్మా !!.. తమ్ముడు ఎవరు ? ఇది నా చెల్లి . ఇందాక
డాబా మీద ఏమైంది అని అడిగితే దీని సిగ్గు చూడాలి. గంట క్రితం వరకు కస్సుబుస్సు లాడింది.
సారీ, ఆడాడు. హహ . ఇప్పుడు చూడు మొహం చిచ్చుబుడ్డిలా వెలిగిపోతోంది. ఏం మాయ చేసాడే!!
చెప్పు చెప్పు "
"అవును రా.. చ చ , అవునే .. అంతలా మాయ ఏం జరిగిందో చెప్పు . నాన్న కూడా లేరు,
ఫోన్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక్కడ మనమే ఉన్నాము, ఇంటి ఆడవాళ్ళమే. "
"అమ్మా !!!" అంటూ సాగదీసి ఒక చూపు ఇచ్చాను .
"ఓయబ్బో .. అప్పుడే మీ చెల్లికి సింగారం ఒచ్చేసిందే !!!" అంది అమ్మ.
"ఇదేమి చూసావు, ఇందాక చూడాలి దీని సిగ్గు. పుట్టు ఆడదాన్ని , నేనే అంత సిగ్గు
పండించలేను !!! హహహ "
"సర్లేమ్మా, ముందు దీన్ని చెప్పని."
"నువ్వు చెప్పవే !!!" అంది
అక్క.
"చెప్పాలా ??"
"చెప్పవా ?? చంపుతా.... ఇక సాగదీయకుండా జరిగింది చెప్పు !!"
"చెప్తాలే !!!"
"చెప్పవే త్వరగా !"
"అంటే అది. డాబా మీదకు వెళ్ళమన్నావు
కదా, సో మెల్లిగా కింద నుండి లేచి , కుచ్చిళ్ళు పట్టుకుని స్టెప్స్ ఎక్కుతున్నానే.
మంచి చల్లని గాలి వీచింది . స్టెప్స్ ఎక్కుతూ ఉంటె, ఈ జడ, తలలో పూలు, గాజుల శబ్దాలు,
పట్టీల ఘల్ ఘల్ , ఎంతో హాయిగా ఆహ్లాదంగా అనిపించింది."
"ఓహో ఓహో !!! చీర కట్టే ముందు గోల , ఇపుడు హాయి అంట. చీర కట్టు లో ఉన్న గొప్పతనమే
అది. తెలుస్తుంది లే మెల్లిగా ". సిగ్గు తో నవ్వుతో మ్మ్ కొట్టాను .
"అలా పైకి వెళ్ళగానే ఆయన ఉన్నారు. మంచి ఎత్తు. హ్యాండ్సమ్ గా . నేను చూడు
అటు ఇటు కానీ వాడిలా చీర కట్టుకుని వచ్చాను అనుకుని సిగ్గుగానే దగ్గరకి వెళ్లి 'హాయ్'
అన్నాను."
"హే హాయ్ .. చూడనేలేదు సారీ కూర్చోండి ".
"మీరు కూడా కూర్చోండి ".
ఇద్దరమూ కూర్చున్నాము.
ఆయన రిలాక్స్డ్ గానే ఉన్నారు. నేను చీర కొంగుని ముందుకి తెచ్చుకుని వొళ్ళో వేసుకుని
కూర్చున్నాను . హెయిర్ సర్దుకుంటూ చెవి వెనక్కి.
"నా పేరు సిద్ధార్ద్ అండి."
"హా తెలుసండీ"
"చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నారు."
"లేదండీ, ఇది నాకు అలవాటే. ఇట్లా
చీర కట్టుకుని అబ్బాయిలతో పెళ్లి చూపులకి వెళ్లడం " అని వెక్కిరించినట్టు
చెప్పాను.
"క్షమించండి ఇదంతా నావల్లే అర్ధం
చేసుకోగలను మీ సిట్యుయేషన్ . పెళ్లి చూపులు అని అని అనుకోవడం మానేసి కాజువల్ గా మాట్లాడుకుందా
ము !.
ఉదయం నుండి హడావిడి చేసుంటారు కదా, మా ఇంట్లో కూడా, ఈ గోల లేకుండా ఇక్కడ బాగుంది
"
చిన్న స్మైల్ ఇచ్చాను.
"హమ్మయ్య, పర్లేదు. నార్మల్ గానే ఉండండి."
అలా కొంచెం రిలాక్స్ అయ్యాక మాట్లాడుకోవడం మొదలైంది. అలవాట్లు, ఆలోచనలు, ఇష్టాలు,
కోపాలు, చిరాకులు అన్నీ ఇద్దరం నవ్వుకుంటూ చాలాసేపు స్పెండ్ చేసాము.
అప్పుడు అన్నారు....
"మనం ఎంత సేపు ఇలా మాట్లాడుకున్నా పెళ్లి టాపిక్ డిస్కస్ చెయ్యాల్సిందే కదా
. ఎలా అనిపిస్తుంది, ఏం అనిపిస్తుంది?"
అని అడిగారు ఆయన.
గొంతుకేదో అడ్డం పడినట్లైంది !!! తడబాటుతో కొంచెం భయం గానే అడిగాను..
"అసలు ఏంటి ఇది. ఇలా ఎక్కడన్నా ఉంటుందా ?? గే అని చెప్పారు మీరు. నేను కాదు
కదా. మరి ఎందుకు నాతో సంబంధంకి వచ్చారు. మీలా ఉండే హ్యాండ్సమ్ గే ని చేసుకోవచ్చు కదా.
నన్ను ఎప్పుడు చూసారు? కచ్చితంగా నా డైలీ వేర్ లో నే చూసి ఉంటారు . ఇప్పుడు చూడండి,
మీ అమ్మ గారి కోసం చీర కట్టించి, పూలు పెట్టి, గాజులు కూడా వేశారు. అటు ఇటు కానీ ఫేక్
కొజ్జా లా వున్నా."
"అయిపోయిందా !!!" అన్నారు.
"మ్మ్ " అంటూ మూలిగా.
"చూడు. నేను నిన్న ఫస్ట్ టైం చూసినప్పుడే నచ్చేశావు. అవును, నీ డైలీ వేర్
లోనే చూశాను. బట్ ఆ ఇన్స్టంట్ లో అనిపించింది - భలే ఉన్నావు అని. హెడ్ ఓవర్ హీల్స్
అంటారు కదా. అలా పడ్డాను నీ ప్రేమలో. నిన్ను చాలా నెలల నుండి ఫాలో చేస్తున్న. అప్పుడే తెలిసింది నీ గురించి, నీ ఫామిలీ గురించి. మాకు
తెలిసిన అమ్మాయికి సంబంధం కోసం అని నీ గురించి ఆరా తీసాను.
అందరూ నీకోసం చాలా మంచిగా చెప్పారు. నాకు కన్ఫర్మ్ అయ్యింది, నా సెలక్షన్ తప్పు
కాదు అని. చూసిన మొదటి క్షణమే ప్రేమ లో పడ్డాను . గే అంటున్నావు కదా. అసలు నేను ఇంట్లో
చెప్పింది కూడా నిన్ను చూసాకే. గొడవలు అయ్యాయి. అమ్మ ససేమిరా కుదరదు అంది. మాట్లాడడం
మానేసాను అమ్మ తో. బిజినెస్ చూసుకోలేదు , నష్టాలు వచ్చాయి కొంచెం . కొన్ని నెలలు అయ్యాక,
అమ్మ ఒప్పుకుంది ఒక కండిషన్ మీద. నా గురించి తెలియకూడదు బయట అని. సో నా పార్టనర్ ఇంటికి
కోడలి గానే రావాలి అని.
ఇంత వరకు ఎలాగో తీసుకొచ్చాను. నా వన్
సైడ్ ప్రేమని , మిగతాది నా చేతుల్లో లేదు అని నాకు తెల్సు . అయ్యేది ఏదో అవుతుంది
. కనీసం నిన్ను చూడటానికి అయినా ఛాన్స్ ఉంటుంది
అని ఈ పెళ్లి చూపులు. ఇది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ నీకు. నీ పాత లైఫ్ ని వదిలేసి,
కొత్త లైఫ్ కి రావాలి. నా భార్య లాగా. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా ఓకే . ప్రపోజల్
కి చాలా ప్లాన్ చేసుకున్నాను. ఆ ఛాన్స్ లేకుండా
ఇలా అయ్యింది. బిగ్ డెసిషన్ , ఆలోచించి తీసుకో. నా సైడ్ నుండి క్లియర్ గా వున్నా అని
నా ఫీలింగ్."
ఒక 10 నిముషాలు అంతా నిశబ్దం !!
నా మైండ్ పనిచేయలేదు. నా ఆలోచనలు ఎటు వెళ్తున్నాయో !!
హౌ క్యూట్ !!! . ఇదేంటి నాకు ఈ అబ్బాయి నచ్చడం ఏంటి . కానీ అతని మాటల్లో నిజాయితీ
ఉంది, ప్రేమ ఉంది. నాకోసం అంత చేశాడా !!! . నేను పెళ్లి చేసుకున్నా కూడా నా భార్య ని
అంత ప్రేమించలేను. ఇతని జీవిత భాగస్వామిగా ఎవరు వచ్చినా లక్కీనే. నాకు ఆ ఛాన్స్ వస్తుంది.
కానీ అమ్మాయిలా చీరలు కట్టుకుంటూ బ్రతకాలి. ఎలా ? ఏం చెప్పాలి ఏం
చెప్పాలి అని ఆలోచిస్తుండగా ....
వెనుక నుండి నన్ను కౌగిలించుకున్నట్లై వెనక్కి చూశాను. నన్ను నా వెనకనుండి సున్నితంగా
కౌగిలించుకున్నారు. నులి వెచ్చగా, ప్రేమగా,
గట్టిగా ఉంది ఆ కౌగిలింత. ఆ బిగి కౌగిలిలో అర్ధమైంది నామీద ఎంత ప్రేమ ఉందో అని.
.
"హే సారీ. నువ్వు ఆలా చైన్ ని నోట్లో పెట్టుకుని ఆలోచిస్తుంటే చాలా క్యూట్
గా కనిపించావు. మనస్సు కంట్రోల్ కొంచెం తప్పింది . ఐ యాం సారీ " అన్నారు.
పర్లేదు లే అన్నట్టు తల ఊపాను కొంచెం సిగ్గు పడుతూ లోలోపల .
"నీ డెసిషన్ ఏమైనా నాకు ఓకే. ఒక్కసారి
అయినా కలిసి నా ప్రేమ ని చెప్పాలనుకున్నాను. ఇప్పటికి నా కోరిక తీరింది. చాలా హ్యాపీ డే నాకు " అని షాక్ హ్యాండ్ ఇచ్చి
వెళ్లిపోయారు కిందకి.
అంతే !!! ఫిదా నేను దానికి. ఇంత ప్రేమని కాదు అనడం పిచ్చి తనమే. ఇంత ప్రేమ ఎందుకు
వద్దనుకుంటాను. నాకు కావలి. నాకే కావాలి. నా వాడు అని ఫిక్స్ అయ్యా. మా ఆయన సిద్ధార్థ్
అని !!
ఏం జరిగిందో చెప్పాక చిన్నగా కళ్ళు ఎత్తి చూసాను. అమ్మ అక్క ఇద్దరు నోర్లు వెళ్ళబెట్టి
చూస్తున్నారు.
"ఏంటి, ఏమైంది ??" అన్నాను
"ఒక గంటలో అంత లవ్ స్టోరీ నడిచిందా మీ మధ్యన ??" అంది అక్క.
సిగ్గు పడుతూ "ఆయనదే లవ్ స్టోరీ, నేను ఓకే చెప్పా అంతే " అని నవ్వాను
.
"ఏంటీ ఆ సిగ్గు. ?? నిజంగా లవ్వేనా ?"
"మ్మ్.. అవునక్కా, ఐ థింక్ సో !! ", "చాలా మర్యాదగా మాట్లాడారు
, ఆలా వింటూ ఉండిపోయా అంతే. ఇంకా అవే మాటలు వినపడుతున్నయి నాకు, ఇలా ఓకే చెప్తా అని
గంట క్రితం వరకు అనుకోలేదే !! " అంటూ తల దించుకున్నా.
"అయ్యబాబోయ్! ఎంత ముద్దొస్తున్నావో ఆలా సిగ్గు పడుతుంటే ఈ చీర లో. ఈ అవతారం
లో చూసి టెంప్ట్ అయిపోయి ఉంటాడు గురుడు !!
" అంటూ గిచ్చింది .
"అయ్యారు, చెప్పా కదా లాస్ట్ లో హాగ్ ఇచ్చారు అని "
"అయ్యారు అంట, ఆయన అంట, నా వాడు అంట. మాటలు బాగా నేర్చింది నా చెల్లి మొగుడు
రాగానే " అని గెడ్డం పట్టుకుని బుగ్గలు ఆడిస్తూ అంది.
అమ్మ, "చాలా హాపీగా ఉందే. మంచి నిర్ణయం తీసుకున్నావు. మంచి ఫామిలీ అంట. సిద్దార్ద్
కూడా మంచి వ్యక్తి . ఆ ఇంటికి కోడలిగా నీకుండే స్థాయే వేరులే" అంది !!
అమ్మ ఆనందంతో లోపలి వెళ్లిపోయింది.
"ఇప్పుడు చెప్పవే .. అమ్మ లేదు, మనిద్దరమే . చెప్పా కదా సిస్టర్స్ ఇప్పుడు
మనము . అవునా కాదా ?"
"ఊర్కో అక్క... ఆటపట్టించకు !" అని సిగ్గు పడ్డాను.
"అబ్బా అబ్బా ఆ సిగ్గు చూడు... చెప్పు
, మనం ఏంటి ?"
"సరే లేవే బాబూ చంపుతున్నావు. ఇవాళ్టి నుండి నేను నీ చెల్లి ని, మనం అక్క
చెల్లెళ్ళం , హ్యాపీనా ?" అన్నాను నవ్వుతు.
"దట్స్ మై స్వీట్ సిస్టర్ " అంటూ హగ్ చేసుకొంది.
"సో, చెప్పు. లవ్ స్టోరీ చెపావు . కానీ నీ మోహము లో ఆ వెలుగు, నీ నవ్వు,
సిగ్గు, పెళ్లి చూపులు అయ్యి మూడు గంటలు దాటినా ఇంకా ఒక్క గాజు కూడా తియ్యలేదు, ఏంటి
సంగతి " అంది అక్క.
"అంటే ???"
"ఏం అనిపిస్తుందో చెప్పవే !!"
"అసలు అంత ప్రేమ ఎలానే ??? తట్టుకోవడం నా వల్ల కావడం లేదు, ఇందాక డాబా మీద
గట్టిగ హత్తుకుని ముద్దు పెడదామనిపించిందే.
. ఏంటో ఈ కట్టు బొట్టు వల్లనేమో అంత ధైర్యం చేయలేకపోయాను!! అసలు వదులుకోవాలి అనిపించలేదే
. అందుకే ఓకే చెప్పేసాను.
వాళ్ళ ఫామిలీ ఏమంటారో చూడాలి."
"ఒసేయ్ !!!. నువ్వేనా ? అంతలోనే ఇంత మార్పా?... ఓ మై గాడ్ . లవ్ లో పడినట్టున్నావే
."
"అవునక్కా, అదే అనిపిస్తుంది నాకు కూడా. మగాడినై ఉంది ఒక అబ్బాయితో లవ్ లో
పడతా అనుకోలేదు."
"తప్పేంటి, నువ్వు ఎలాగో అమ్మాయివేగా ఇంకా .. హహ "
"హే పోవే "
"పిచ్చి పిల్లా , మీ జోడీ బాగుంటుంది ఇద్దరికీ ఒకరికి ఒకరు అన్నట్లుంటారు.
నువ్వు ఎలాగూ తన మీద 4-5 అంగుళాలు పొట్టే " అంది. అలా నవ్వుకుంటూ
ఉన్నాము.
ఇంతలో నాన్న వచ్చి చెప్పారు "వాళ్ళకి కూడా సంబంధం ఓకే అంట. త్వరలో ముహుర్తాలు
పెడదామని చూస్తున్నారు. ఏం చెప్పమంటారు ?"
అక్క "ఏం చెప్పేదేంటి, ఇక్కడ పీకల్లోతు ప్రేమ లో పడింది మీ చిన్న కూతురు
, ఓకే చెప్పేయ్ ఓకే చెప్పేయ్ "
నాన్న నాతో "నువ్వు చెప్పు" అన్నారు
"నాకు కూడా ఇష్టమే నాన్న " అని చెప్పాను . అంత సిగ్గు నా జీవితంలో లో
ఎప్పుడూ పడలేదు. కన్నతండ్రి ముందే చీర కట్టుకుని, బొట్టు గాజులు వేసుకుని, పూలు పెట్టుకుని,
వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్తాననుకోలేదు.
ఇంటిల్లిపాదీ అందరం సంతోషంగా ఉన్నారు.
రెండవ భాగము త్వరలోనే
No comments:
Post a Comment