మేము ఊటీ చేరిన తరువాత.,.....
నెక్స్ట్ డే డాక్టర్ సోమసుందరం వచ్చారు..... ఆయనతో ఒక మేల్ నర్స్, ఫిమేల్ నర్స్ లు వచ్చారు.
నాకు ట్రీట్మెంట్ కొరకు ఒక రూంను సిద్ధం చేశారు.....
డాక్టర్ నన్ను చెక్ చేశారు....
నాతో "హార్మోన్స్ పనిచేయడం ప్రారంభం అవుతుంది. మీ చర్మంపై వెంట్రుకలు పెరుగుదల ఆగిపోతుంది.... బ్రెస్ట్ కొంచెం పెరగడం ప్రారంభం అవుతుంది..... మీ హిప్స్(పిరుదులు) పెరుగుతాయి. మెడిసిన్స్ వేడిని తట్టుకోవడానికి బాడీని కూల్ చేసే లిక్విడ్స్ తీసుకోండి..... ఒక టూ మంత్స్ తరువాత SRS సర్జరీ ఉంటుంది.... సిద్ధార్ద్ సర్ బెంగళూరు వెళ్ళిపోయినా నా అసిస్టెంట్స్ ప్రతిరోజూ మిమ్మల్ని చెక్ చేసి మీ హెల్త్ అప్డేట్స్ నాకు ఇస్తూ ఉంటారు. మీరు మా మీద నమ్మకముంచి ఇది వరకటిలానే బోల్డ్ గా ఉండండి. SRS సర్జరీ టైంకి మనం థాయిలాండ్ వెళదాము." అని ప్రక్కనే ఉన్న వాళ్ళ స్టాఫ్ కి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి వెళ్లిపోయారు.
పరిణీత కి 24 లేక 25 ఏళ్ళ వయసు ఉంటుంది. తను MA గుజరాతి చదివిందట. తనతో నాకు గుజరాతి నేర్పమని చెప్పారట మా అత్తమ్మ. తనుకూడా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న అమ్మాయే.
రోజూ ఒక గంట మార్నింగ్ వాక్ కి వెళ్ళేటప్పుడు కొంచెం కొంచెం పదాలు చెప్తూ, మధ్యాహ్నం పదాలు ఎట్లా వ్రాయాలో నేర్పుతూ తను క్లాసెస్ స్టార్ట్ చేసింది
కుసుమ మెడిసిన్స్ యెట్లా వేసుకుంటున్నానో, బాడీలో చేంజెస్ ఏమైనా వస్తున్నాయా అని గమనించడం, ఇంటిలోకి కావలసిన సరుకులు, వెజిటేబుల్స్ తీసుకురావడం తన డ్యూటీ.
ఒక 15 రోజుల తరువాత నా శరీరంలో మార్పులు కనిపించడం ప్రారంభమైంది. రొమ్ములపైన ఉండే నిపుల్స్ పెరగడం, మార్నింగ్ టైములో కొంచెం బిగుతుగా కనపడటం జరుగుతోంది. నైట్ ప్యాంట్స్ కొంచెం బిగుతుగా ఉంటున్నాయి. పిరుదులు కొంచెం వెడల్పు అవుతున్నాయి. అప్పటికే పెంచిన నా జడ ఇంకా భారీగా పెరుగుతోంది. శరీరంపైన రోమాలు ఊడిపోతున్నాయి. ముఖంలో ఏదో గ్లో కనపడుతోంది. బహుశా అమ్మ ప్రతి మూడురోజులకు నాకు నలుగుపెట్టి స్నానం చేయించడం వలన కూడా కావచ్చేమో.
తెల్లవారుఝామున నైటీ చాటునుండో, లోపలి లంగాల చాటు నుంచో ఇబ్బంది పెట్టే నా జూనియర్ కూడా లేచి నిలబడడం తగ్గింది. నా అంగం సైజు కూడా ష్రింక్ అవుతోంది అంటే భవిష్యత్తులో నాలో విషయం ఉండదన్నమాట. ఆ ఆలోచన నాకు ఏదోలా అనిపించినా సిద్ధుకోసమే గదా ఇదంతా అని సరిపుచ్చుకున్నాను.
మధ్యలో హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఇంజెక్షన్స్ చేసేవాళ్ళు. సోమసుందరం గారైతే ఫోన్ లేదా జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడేవారు. సిద్ధూ కూడా అట్లానే మాట్లాడేవాడు.
అత్తమ్మ అయితే ప్రతిరోజూ ఒక గంట మాట్లాడుతూ ఉండేవారు. అట్లా రెండు నెలలు గడిచిపోయాయి.
నా రొమ్ముల సైజు పెరిగింది. నడుం సన్నబడింది. బ్యాక్ ప్యాక్ వెడల్పు అయ్యింది. ముఖంలో ఎక్కడా వెంట్రుక అనేది లేకుండా పోయింది. జుత్తు అయితే ఒత్తుగా పెరిగిపోయింది.
ఒక వైపు గుజరాతీ భాష నేరచేసుకున్నాను. అత్తమ్మతో అనర్ఘళంగా మాట్లాడుతున్నాను. కుసుమ అయితే షాక్.
అమ్మ నాన్న బెంగళూరు వెళ్ళి యేవో పనులు చక్కబెట్టుకుని 15రోజుల్లో వచ్చేస్తామని అత్తమ్మకి చెప్పి వెళ్లారు. వాళ్ళు వెళ్లకముందే అత్తమ్మ వచ్చేసారు.
నేను ఇదివరకటిలా ఆలోచించడంలేదు.... నా పనులు చక్కబెట్టడానికి ఎవరో ఒకరు తోడు ఉంటున్నారు. మెడికల్ గా నా ట్రాన్సిషన్ ప్రాసెస్ అంతా సిద్ధూ కనుసన్నలలో జరుగుతోంది. ఏది కావాలన్నా క్షణంలో నా ముందుంటోంది. ఇక నేను ఆలోచించడానికి ఏముందని. నేను చేయాల్సిందల్లా నాలో స్త్రీత్వాన్ని మెరుగు పరుచుకోవడమే. మగవాడిని అని తెలిసికూడా నన్ను కోరుకున్న సిద్ధూని పూర్తిగా ఆడదానిగా మారి సంతోషపెట్టడమే నా డ్యూటీ అని అర్ధం అయ్యింది. ఇక నేను మగవాడిని అనే విషయాన్ని మర్చిపోయాను. కేవలం స్నానం చేసేటప్పుడు, మూత్ర విసర్జన సమయంలోనే నాకు అంగం ఉందనే విషయం గుర్తుకొస్తోంది.
అమ్మ వాళ్ళు వెళ్ళాక అత్తమ్మ నన్ను చాలా కేరింగ్ గా చూసుకొంటున్నారు. ఆ సమయంలో సిద్ధూ వాళ్ళ సమీప బంధువులు ఎవరో మౌంట్ అబూలో చనిపోతే అత్తమ్మ, సిద్ధూ వెళ్లారు. అప్పుడు విషయం తెలిసి అక్కా బావ వచ్చారు.
నేను ప్యాంటు షర్ట్లు విడిచిపెట్టి చీరలు సింగారించుకోవడం మొదలుపెట్టాక మా బావని చూడటం ఇదే మొదటిసారి. నైటీలో ఉన్న నాకు కొంచెం సిగ్గేసినా ఆయనతో నాకేమిటి అనుకొని విష్ చేశాను. తను నన్ను కొంచెం విచిత్రంగా చూసినా మామూలుగానే నీలిమ అనే మాట్లాడాడు. బహుశా అక్క మెంటల్ గా ప్రిపేర్ చేసి ఉండొచ్చు. కుసుమ వాళ్లకు ఉండటానికి రూమ్ చూపించింది.
కాసేపాగి అక్క నా రూంలోకి వచ్చింది.
అమ్మ నలుగు పెట్టి స్నానం చేయించమందట.
ఇప్పుడే వచ్చావు కదే. ఈవెనింగ్ చేయిద్దువు అన్నాను.
ఎట్లా ఉందే అని అడిగింది. నైటీ చాటున నా రొమ్ములను పరీక్ష గా చూస్తోంది. ముఖంలో నిగారింపు, ఒత్తుగా పెరిగిన జడ, టోటల్ గా మారిపోయిన నా బోడీ స్ట్రక్చర్ ని ఆశ్చర్యంగా చూస్తోంది.
"నాకేమిటే బిందాస్ గా బ్రతికేస్తున్నాను. సిద్ధూ గనుక నా జీవితంలోకి రాకుండా ఉంటే ఆ బెంగళూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఫ్యాక్టరీలలో యూనిఫామ్ వేసుకుని చెమటలు కారుస్తూ ఉండేవాడిని. తన ప్రేమ చెమటలు కక్కుతూ పని చేయాల్సిన నన్ను ఇదిగో ఇక్కడ ఊటీ ఫార్మ్మ హౌస్ లో మహారాణిలా కూర్చోబెట్టింది. అత్తమ్మ అమ్మకంటే ఎక్కువగా చూసుకుంటున్నారు." అన్నాను.
సిద్ధూ ప్రపోజల్ ఒప్పుకున్నాక మొదట్లో అన్నీ ఆర్టిఫిషియల్ గా ఉండేవి. ట్రీట్మెంట్ మొదలయ్యాక మీకులాగానే ఆస్తులన్నీ వచ్చేసాయి అని నవ్వేశాను.
అక్క "మెడికేషన్ స్టార్ట్ అయ్యాక నువ్వెలా ఉంటావో అనుకున్నాను. అమ్మ ద్వారా తెలుసుకున్నాక, ఇదిగో ఇప్పుడు నిన్ను చూసాక రిలీఫ్ ఫీల్ అవుతున్నాను" అంది.
ఈలోపు కుసుమ వచ్చింది..... అక్కకు మా మరదలు, మా ఇంటి ఆడపడుచు అని తనని పరిచయం చేశాను. తను ఆనందపడిపోయింది. అక్క, తను మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.
అప్పుడే అత్తమ్మ ఫోన్ చేశారు నా యోగక్షేమాలు కనుక్కోవడానికి. నేను ఆవిడతో గుజరాతిలో మాట్లాడుతూ ఉంటే అక్క షాక్. పరిణీతని కూడా పరిచయం చేశాను.
అత్తమ్మ మళ్ళీ ఫోన్ చేసి అక్కతో కూడా మాట్లాడారు. అప్పుడే అక్క తను బావతో కలిసి గురువాయూర్ వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలనుకున్నట్లు చెబితే అత్తమ్మ నన్ను, కుసుమని, పరిణీతని కూడా వెళ్ళమన్నారు. నేను ఆవిడ,సిద్ధూ వచ్చాక వెళదాము అన్నాను. ఆవిడ సరే ఒక రెండు రోజుల్లో వచ్చాక అందరం కలిసి వెళదాం అన్నారు.
అక్క "ఏమిటే నాతో రావా? మీ ఆయన, అత్త గారితోనే వెళ్తావా? చాలా చేస్తున్నావే" అంది.
నేను "అదికాదే ఈ ట్రీట్మెంట్ మొదలయ్యాక కాదు.... కాదు..... అసలు సిద్ధూ వచ్చాక గుడికంటూ వెళ్తే తనతోనే వెళ్ళాలి అనుకున్నాను. అయినా నీకు బావకి మధ్య పానకంలో పుడకలా మేమెందుకు" అన్నాను.
సరేలే..... మీ అత్తగారు కూడా రెండు రోజుల్లో వస్తామంటున్నారు కదా.... అందరం కలిసే వెళదాం అంది అక్క.
ఆ సాయంత్రం అక్క నా ఒంటికి నలుగు పెట్టి స్నానం చేయించింది. బాత్రూంలో స్టూల్ మీద ఏపుగా ఎదిగిన నా చన్నులపై నుండి కాటన్ లోపలి లంగా కట్టుకుని కూర్చుంటే అక్క నలుగు పెడుతూ నన్ను, నా శరీరాన్ని విప్పారిన కళ్ళతో చూస్తూ నలుగు పెట్టి స్నానం చేయించి నా జడని విడదీసి సాంబ్రాణి ధూపం వేసింది.
ఆ సాయంత్రం అప్పటివరకు నైటీలే వాడిన నేను పింక్ కలర్ లినెన్ చీర కట్టుకున్నాను. అందరం కలిసి భోజనం చేద్దామని డైనింగ్ హాల్లోకి వెళ్తే బావ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని నన్ను కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుంటే గర్వంగా ఫీల్ అయ్యాను.
నానీ, నిన్నిలా చూస్తుంటే షాకింగ్ గా ఉన్నా కుటుంబం కొరకు నువ్విలా చేయడం చాలా గ్రేట్ అన్నాడు బావ.
నన్నంత పొగడకులే బావా.... ఎంత కుటుంబం కోసమైనా ఇంతలా చేయలేనేమో కానీ సిద్ధూ, వాళ్ళమ్మ గారు నన్ను చూసుకున్న తీరు నన్ను నేను వాళ్లకు సమర్పించుకునేలా చేసింది బావా.... అన్నాను.
మా అక్క "బావా మరదళ్ళు ఇట్లా సీరియస్ గా మాట్లాడుకోకూడదు..... కామెడీ గా మాట్లాడుకోవాలి" అంటూ వాతావరణాన్ని తేలిక పరిచింది.
దీనికన్నీ కామెడీలే అని నేను అన్నాను.
భోజనం అయిన తరువాత బావ అట్లా నడిచొస్తా అని బయటికి వెళ్ళాడు.....
కుసుమ "వదినా, మెహందీ పెట్టుకుంటావా? మీ అక్క కూడా ఉన్నారు కదా...." అంది.
నేను సరే అన్నాను.....
అక్క నాకు మెహందీ డిజైన్ వేసింది..... నాతో పాటు తను, కుసుమ, పరిణీత, జానకమ్మ గారు అక్కకు మెహెందీ పెట్టింది. ఆమెకు భర్త చనిపోవడంతో ఆవిడ పెట్టుకోలేదు.
బావ ఇంటికి వచ్చేసరికి మేమంతా కాళ్లకు చేతులకు మెహెందీ పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటున్నాము.
బావ మమ్మల్ని చూస్తూ వాళ్ళ గదిలోనికి వెళ్ళిపోయాడు.... ఆఫీసుకి లాగిన్ టైం అయిపోయిందనుకుంటా.
నెక్స్ట్ డే ఈవెనింగ్ సిద్ధూ, అత్తమ్మ సరాసరి ఊటీ వచ్చేశారు. అక్క కూడా నాతోపాటు ఆవిడ కాళ్ళకి నమస్కరించింది..... ఆవిడ మా ఇద్దరినీ ప్రక్కనే కూర్చుండబెట్టుకుని కాసేపు కబుర్లాడి..... మా బావను కూడా పలకరించి మాట్లాడింది.
సిద్ధూకి మా బావని పరిచయం చేసింది అక్క. సిద్ధూ మా బావతో పొలైట్ గా మాట్లాడారు. మా బావైతే వాళ్ళ గురించి తెలిసిందిగా...... చాలా పొలైట్ గా రెస్పాండ్ అయ్యాడు.
డిన్నర్ అయిపోయాక సిద్ధూ బావతో "బ్రదర్, రేపు అందరం గురువాయూర్ వెళదాము..... రేపు ఈవెనింగ్ బయలుదేరితే ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చు" అని అన్నాడు
నెక్స్ట్ డే మధ్యాహ్నం మేమంతా గురువాయూర్ బయలుదేరాము. సిద్ధూ నన్ను చీరలు తెచ్చుకోమన్నాడు. ఆడవాళ్లు చీరలు కట్టుకోవాలట, మగవాళ్ళు కేవలం పంచలు కట్టుకోవాలట. లేకపోతే గుడిలోనికి రానివ్వరట.
సిద్ధూ, నేను, అత్తమ్మ, కుసుమ ఒక కారులో..... అక్క, బావ, పరిణీత, జానకమ్మగారు ఒక కారులో వెళ్ళాము.
తరువాతి రోజు తెల్లవారుఝామున దర్శనానికి బయలుదేరాము. నేను, అక్క, కుసుమ, పరిణీత కేరళ కాటన్ చీరలు కట్టుకున్నాము. అత్తమ్మ, జానకమ్మ గారు మామూలు నేత చీరలు కట్టుకున్నారు. బావ, నా సిద్ధూ ఇద్దరూ తెలుపు రంగు ధోతీలు కట్టుకుని వంటి పైన కండువాలు కప్పుకొని వెళ్ళి దేవుడిని దర్శించుకుని అక్కడే లంచ్ ముగించుకుని తిరిగి ఊటీ చేరేసరికి ఈవెనింగ్ అయిపొయింది.
నేను, అత్తమ్మ ఒకే గదిలో ఉన్నాము. అత్తమ్మ స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాక నేనుకూడా ఫ్రెష్ అయ్యాక కుంకుమ రంగు చీర కట్టుకుని జడలో పువ్వులు పెట్టుకుని అత్తయ్యను కాళ్ళకు మసాజ్ చేయడం మొదలు పెట్టాను.
అత్తమ్మ నా అరిచేతులను తన చేతుల్లోకి తీసుకుని ఇంతకు ముందుకన్నా ఇప్పుడు సాఫ్ట్ అయిపోయాయి నీలిమా..... అంటూ హెల్త్ పరంగా ఏమైనా కష్టంగా ఉందా అని అడిగారు.
నేను ఏమీ లేదని చెప్తే "సిద్ధూ స్వార్ధం కోసం నిన్ను బలి చేసేస్తున్నానేమో అనిపిస్తోంది తల్లీ" అన్నారు.
మీరు మా ఫ్యామిలీకి చేసిన మేళ్లకన్నా నేను చేసింది తక్కువ అత్తమ్మా..... అసలు దానిగురించి ఆలోచించకండి..... అన్నాను.
ఇంతలో ఏమిటి అత్తకోడళ్ళు గుసగుసలాడేసుకుంటున్నారు అంటూ సిద్ధూ వచ్చారు లోపలికి.
వైట్ కలర్ లాల్చి పైజమా..... రాజకుమారుడిలా కనిపిస్తున్నాడు. తనని చూస్తుంటే నా రొమ్ములపైన నిపుల్స్ బిరుసెక్కిపోయాయి. మెడపైన రోమాలు నిక్కబొడుచుకున్న ఫీలింగ్.... పెదవులు వణుకుతున్నాయి..... నా ఫీలింగ్స్ అత్తమ్మ కి కనిపించకుండా తల దించుకున్నాను బిడియంగా.
అమ్మా.... రెస్ట్ తీసుకో.... నీలిమ నేను అట్లా నడుచుకుంటూ వెళ్ళి వచ్చేస్తాము అని అత్తమ్మ తో చెప్పి "బేబీ పద అట్లా నడుచుకుంటూ వెళ్ళి వద్దాం" అన్నారు.
నేను అత్తమ్మవైపు చూస్తే ఆవిడ వెళ్ళు అన్నట్లు కళ్ళతోనే సంజ్ఞ చేశారు. నేను శాలువా ఒకటి కప్పుకుని బయలుదేరాను తన వెనుక. తనుకూడా ఒక స్వెటర్ వేసుకుని బయటకి వచ్చారు.
నేనేమో నాలో కలుగుతున్న ఫీలింగ్స్ వల్ల మాట్లాడలేకపోతున్నాను. మెల్లగా తన ప్రక్కనే నడుస్తున్నాను.
తానే చొరవ తీసుకుని నన్ను తనకు దగ్గరగా లాక్కున్నాడు. నేను నా తలను తన భుజాలకు తగిలించి తనతో పాటు అడుగులేస్తున్నాను.
దారిలో ఒక చెట్టు క్రింద బెంచీ ఉంది. అక్కడ కూర్చున్నాము.
"హనీ, మౌనవ్రతం చేస్తున్నావా.... మాట్లాడడం లేదు..... మా అమ్మతో మాత్రం గంటల తరబడి మాట్లాడేస్తున్నావు" అన్నారు సిద్ధూ.
నేను చుట్టూ చూసి ఎవరూ లేరని కంఫర్మ్ చేసుకుని తనకు దగ్గరగా జరిగి తన పెదవుల మీద ముద్దుపెట్టేసి మళ్ళీ ఏమీ ఎరుగనట్లు తన ప్రక్కనే కూర్చుండిపోయాను.
నేను చేసిన పనికి షాక్ అయినా "ఏమిటి అమ్మగారు సడన్ గా కరుణించారు", అన్నారు
నేను తన చేతిని తీసుకుని షాల్ క్రిందుగా దూర్చి నా రొమ్ములపైన వేసుకున్నాను. తను సున్నితంగా జాకెట్ మీదుగా నా రొమ్ములను నిమురుతూ ఉన్నాడు
మా మధ్య మాటల్లేవు..... మాట్లాడుకోవడాలు లేవు
ఆ ఏకాంత సమయాన్ని నిశ్శబ్దంగా అనుభవిస్తున్నాము ఇద్దరం
కాసేపటికి "ఇంకో నెలలో థాయిలాండ్ హాస్పిటల్లో అప్పోయింట్మెంట్ తీసుకుంటాను అన్నారు డాక్టర్..... పాస్పోర్ట్స్ చేయించాలి..... అమ్మకు, నాకు, కుసుమకి ఉన్నాయి. మీ పేరెంట్స్ కి, నీకూ తీసుకోవాలి. వాళ్లకు ఫోన్ చేసి చెప్పు " అన్నారు.
"నువ్వేమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా..... మగవాడి నుండి ఆడదానిగా మారుతున్నానని..... నా పిచ్చి వల్లే ఇట్లా జరుగుతుందని కోపం వస్తోందా నామీద " అన్నాడు.
నాకు కోపం వచ్చింది.....
ఇందాకటి నుండి చూస్తున్నాను..... అత్తమ్మ ఇట్లానే అడిగారు..... మీరు కూడా ఇట్లానే అడుగుతున్నారు
ఇష్టం లేకపోతే ఇంతవరకు వస్తానా? ఇట్లా ముద్దు పెట్టుకుంటానా? అంటూ మళ్ళీ నా పెదవులతో తన పెదవులను మూసేసాను..... మా ఇద్దరి నాలుకలు కత్తి యుద్ధం చేసుకుంటున్నట్లు పోరాటం చేసుకుంటున్నాయి.
అంతలో తన చెయ్యి అప్రయత్నంగా నా నడుముపై పడింది నన్ను కసిగా నలిపేస్తూ ముద్దుని కంటిన్యూ చేస్తుంటే ఇంతలో కార్ వస్తున్న శబ్దం వినబడి సర్దుకుని కూర్చున్నాము.
కార్ వెళ్లిపోయాక థాంక్ యూ హనీ..... ఇక వెళదామా..... అన్నారు సిద్ధూ
ఇంటికి వెళ్ళి అత్తమ్మ రూంలోకి వెళ్ళి చూస్తే అత్తమ్మ నిద్రపోతున్నారు. అలికిడి చేయకుండా ఇంకో బెడ్ మీద పడుకున్నాను.
మార్నింగ్ నిద్ర లేచేసరికి అత్తమ్మ రెడీ అయిపోయి హాల్లో పరిణీతతో మాట్లాడుతున్నారు.
వెంటనే త్వరత్వరగా రెడీ అయి బయటికి వచ్చాను. పరిణీత వెళ్లిపోవాలట అందుకే తన ట్రావెల్ కొరకు ఏర్పాటు చేశారు. తనకు ఒక కవర్ ఇచ్చారు సిద్ధూ..... నాతో తనకు చీరను పెట్టించారు అత్తమ్మ. నేను తనకు థాంక్స్ చెప్పాను గుజరాతి నేర్పించినందుకు.
తనని కోయింబత్తూరు నుండి ఫ్లైట్ కి పంపించారు సిద్ధూ దగ్గరుండి.
ఒక 20 రోజుల్లో అమ్మ, నాన్నలకు పాస్ పోర్ట్స్ రెడీ అయిపోయాయి. డా. సోమసుందరం గారి గైడెన్స్ లో మేము థాయిలాండ్ ప్రయాణం అయ్యాము.
నేను, సిద్ధూ, డా. సోమసుందరం, అమ్మ, నాన్న బయలుదేరాము. అత్తమ్మ తరువాత వస్తానని చెప్పారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ కి అక్క, బావ వచ్చి మాకు సెండాఫ్ ఇచ్చారు.
మొదటిసారి విమాన ప్రయాణం.... సిద్ధూ చేతిలో చెయ్యి వేసి గాలిలో ఎగురుతూ ఉంటే అదొక మధురానుభూతి. బ్యాంకాక్ చేరడానికి 4 గంటలు పట్టింది.
ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకుని కమోల్ హాస్పిటల్ కి వెళ్ళాము. అది సెక్స్ చేంజ్ ట్రీట్మెంట్ కి ఆసియాలోనే ఫేమస్ హాస్పిటల్.
వెళ్ళిన రెండురోజులకు మెడికల్ టెస్ట్స్ చేశారు. సిద్ధూ, నాన్న మెడికల్ ఫార్మాలిటీస్ మీద సంతకాలు చేసేసారు.
నెక్స్ట్ డే అంతా సిద్ధూ నాతోనే ఉన్నారు. ఈవెనింగ్ సర్జరీ చేస్తామని చెప్పారు. కేవలం కాటన్ షర్ట్, లాంగ్ స్కర్ట్ వేశారు ... నాలో ఆ హాస్పిటల్ వాతావరణం చూస్తుంటే ఏదో తెలియని భయం. సిద్ధూ నా చెయ్యి పట్టుకుని విడిచిపెట్టడం లేదు. అమ్మ అయితే పూజలు చేస్తోంది. నాన్న గంభీరంగా కనపడుతున్నా కంగారు కంగారుగా ఉన్నారు.
ఆ సాయంత్రం అక్క ఫోన్ చేసి ధైర్యం చెప్పింది. అత్తమ్మ ఫోన్ చేశారు.... ఆవిడ కూడా ఇండియాలో ఉండి పూజలు చేసేస్తున్నారట. కుసుమ కూడా మాట్లాడుతూ చెప్పింది.
అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు నన్ను ఆపరేషన్ థియేటర్ కి తీసుకువెళ్లారు. వెళ్లేముందు సిద్ధూ నా నుదిటి మీద ముద్దు పెట్టుకుని నన్ను కౌగిలించుకున్నారు. అందరిలోను నేనే కొంచెం ధైర్యంగా ఉన్నట్లున్నాను. అమ్మానాన్నలు కంగారు పడుతుంటే నేనే ధైర్యం చెప్పాను.
ఆపరేషన్ థియేటర్లో డా. సోమసుందరం ఉన్నారు. నాకు ఆయన్ని చూడగానే కొంచెం ధైర్యం. నాతో "భయపడాల్సిన పనే లేదు. వరల్డ్ లోనే ది బెస్ట్ సర్జన్స్ వీళ్ళు. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది డోంట్ వర్రీ..... సక్సెస్ఫుల్ గా మనం ఇండియా వెళ్తున్నాము" అని ధైర్యం చెప్పారు.
నేను నవ్వుతూ "థాంక్ యూ డాక్టర్" అన్నాను.
అక్కడే ఉన్న అనస్థిషియన్ నన్ను నా పర్సనల్ డీటెయిల్స్ అడుగుతూ ఇంజెక్షన్స్ చేశాడు. నేను మాట్లాడుతూనే మత్తులోకి జారిపోయాను.
ఏవో శబ్దాలు వినపడుతున్నాయి. డా. సోమసుందరం నేనేమైనా స్పృహలో ఉన్నానేమో అని నీలిమా అని పిలుస్తున్నారు. కానీ పలకాలని ఉన్నా నేను పలకలేకపోతున్నాను.
నాకు స్పృహ వచ్చేసరికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నాను. కాళ్ళు, చేతులు కదపకుండా బెడ్ కి కట్టేశారు. శరీరాన్ని కదల్చలేకపోతున్నాను. పొత్తికడుపు క్రింది భాగంలో నొప్పిగా ఉంది. ఆ నొప్పికి కళ్ళ వెంబడి నీళ్ళు కారిపోతున్నాయి.
డా. సోమసుందరం నాకు మెలకువ రావడం చూసి నర్స్ కి చెబితే ఆమె వచ్చి పెయిన్ ఉందా అని ఇంగ్లీషులో అడిగింది. నేను బాధతోనే తల ఊపితే ఆమె 'డోంట్ వర్రీ..... తగ్గిపోతుంది అని లోకల్ అనస్తిషియా ఇచ్చింది. కొంచెం నొప్పి తగ్గింది.
డా. సోమసుందరం ముందుకు వచ్చి ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ మేడం.... పోస్ట్ ఆపరేషన్ ప్రొసీజర్ కొంచెం కష్టం.... మీ విల్ పవర్ ముందు అది పెద్ద కష్టం కాదు.... ఒక వారంలో ప్రొసీజర్స్ అన్నీ పూర్తి అయిపోతాయి.... మనం ఇండియా వెళ్లిపోవచ్చు అన్నారు.
డాక్టర్ ని సిద్ధూ గురించి అడిగాను.... తను మాకు ఇచ్చిన రూంలో ఉన్నారట.
డాక్టర్ సిద్ధూకి నేను స్పృహలోకి వచ్చానని ఇంటిమేట్ చేశారు. అమ్మ, నాన్నలతో కలిసి సిద్ధూ వచ్చాడు.
పేరెంట్స్ ముఖాలలో టెన్షన్.... అమ్మ అయితే నన్ను బ్యాండేజ్ లలో చూసి కంగారు పడిపోయి ఏడ్చేస్తోంది.
డాక్టర్ గారు కంగారు పడాల్సిందేమీ లేదన్నారు. అమ్మానాన్నలు ఇంకా అక్కడే ఉంటే ఏడ్చేస్తారని సిద్ధూ తను ఉంటానని వాళ్ళని వెళ్ళి రెస్ట్ తీసుకొమ్మన్నారు.
వాళ్ళు నన్ను వదిలి వెళ్లలేక వెళ్లారు. సిద్ధూ నా ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు. డాక్టర్ గారు మళ్ళీ వస్తానని వెళ్ళారు. మేం ఇద్దరమే ఉన్నాము ఆ రూంలో.
అప్పటివరకు గంభీరంగా కనపడిన సిద్ధూ కళ్ళల్లోనుండి కన్నీరు కారిపోతోంది.
నేనే "ఇప్పుడేమయిందని హనీ.,. ఆపరేషన్ సక్సెస్ అన్నారు కదా.... త్వరగా వెళ్ళిపోదాం మనింటికి అన్నాను."
తను నెమ్మదిగా "నీకు సర్జరీ జరిగి ఇది మూడోరోజు బేబీ.... మూడురోజుల తరువాత నువ్వు స్పృహలోకి వచ్చావు..... ఇంత కష్టం అని ముందే తెలిసుంటే అసలు సెక్స్ చేంజ్ ఆపరేషన్ అస్సలు వద్దనేవాడిని" అన్నారు
ఆమ్మో..... మూడు రోజుల తరువాత స్పృహలోనికి వచ్చానా..... తలుచుకుంటే ఒళ్ళు జలదరించింది.
యూరిన్ పాస్ అవ్వడానికి ట్యూబ్ అమర్చారట. ఇంకో రెండు రోజుల తరువాత నెమ్మది నెమ్మదిగా ఈ గొట్టాలన్నీ తీసేస్తారు...... అన్నారు
ఈలోపు నర్స్ వచ్చి కొన్ని టాబ్లెట్స్ ఇచ్చింది..... క్రమంగా నిద్రలోకి జారుకున్నాను.
ఆ నెక్స్ట్ డే డాక్టర్ వచ్చి కాళ్ళకు చేతులకు ఉన్న బంధనాలను తొలగించారు. కానీ నొప్పి తెలుస్తోంది.
నాకు తొడిగిన ఆపరేషన్ గౌన్ పైకి ఎత్తి నా మర్మంగాన్ని తొలగించిన చోట కొంచెం పరీక్షగా చూసి.....
లోకల్ అనస్తిషియా ఇచ్చి ఏదో ఆర్టిఫిషియల్ స్టిక్ ని అందులోకి దూర్చి పైకి క్రిందికీ జరుపుతూ అక్కడ నా పురుష మర్మాంగం స్థానంలో క్రొత్తగా మలచబడిన యోని సక్రమంగా ఉందాలేదా అని పరీక్షించారు.
డాక్టర్ నా యోని ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించి సంతృప్తిగా తల పంకించి, నర్స్ కి ఏవో ఇనస్ట్రక్షన్స్ ఇచ్చి మెడిసిన్స్ వ్రాసి వెళ్లిపోయారు.
ఆయన వెళ్ళిన తరువాత నర్స్, "రేపటి నుండి లూబ్రికెంట్స్ వ్రాసి యోనిలో డిల్డో దూర్చి క్రిందికీ పైకీ ఆడిస్తామని చెప్పింది. అదే విధంగా ట్యూబ్స్ తీసేసి యూరిన్ పాస్ చేయిస్తారట."
ఆ రోజు నైట్ సాలిడ్ ఫుడ్ పెట్టారు.
ఆరాత్రి నిద్ర పట్టలేదు.... నెమ్మదిగా మత్తు మందులు కూడా తగ్గిస్తూ ఆపేసారు..... దానితో నొప్పి తెలుస్తోంది.
మర్నాడు నర్స్, డ్యూటీ డాక్టర్స్ వచ్చి ట్యూబ్స్ రిమూవ్ చేసి నన్ను లేపి కూర్చుండబెట్టారు. కూర్చోలేకపోతుంటే నాకు ఒక నర్స్ సపోర్ట్ ఉండి లేపి నిలబెట్టి అటూ ఇటూ నడిపించారు. ఆ తరువాత అట్లా నడిపిస్తూనే టాయిలెట్ కమోడ్ పైన కూర్చుండబెట్టారు.
ఆడవాళ్ళ యూరిన్ కమోడ్ పై కూర్చుని యూరిన్ పాస్ చేయడం ఏదోలా అనిపించింది.... అదీ గౌన్ వెనుక నుండి పైకెత్తుకొని.....
చాలా కష్టపడాల్సి వచ్చింది.....
రెండు రోజులు నొప్పి భరించాను. క్రమంగా అలవాటైపోయింది.
ఆ తరువాత లూబ్రికెంట్స్ పూసిన డిల్డో నా యోనిలో దూర్చి పైకీ క్రిందికీ ఆడిస్తూ ఉంటే మొదట భరించలేక పోయినా తరువాత ఏదో తెలియని తిమ్మిరిగా ఉండేది.
ఆ తరువాత ఓకల్ కార్డ్స్ ని కూడా ఆపరేట్ చేసి నా స్వరం ఆడదానిలా ఉండే ఉండేవిధంగా మార్చారు డాక్టర్స్.
బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేశారు...... చూస్తూ ఉండగానే 20 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు సంపూర్ణ ఆడతనాన్ని సంతరించుకుని థాయిలాండ్ హాస్పిటల్ లో కూడా చీరలు, చుడిదార్ లే ధరిస్తున్నాను.
అత్తమ్మ కూడా థాయిలాండ్ వచ్చారు. పూర్తిగా ఆడదానిలా మారిన నన్ను చూచి కౌగిలించుకుని ప్రేమగా నుదిటిపై ముద్దుపెట్టుకోవడం చూచిన అమ్మానాన్నలు ఎంతో ఆనందపడిపోయారు.
డాక్టర్స్ డిశ్చార్జ్ అయిపోవచ్చు అని అన్నాక మేము బెంగళూరు బయలుదేరివచ్చాము. అత్తమ్మ నన్ను మా ఇంటికి వెళ్లమన్నారు. అమ్మా నాన్నలతో త్వరలో మంచి ముహూర్తం చూచి పెళ్ళి చేసిన తరువాత ఇంటికి తీసుకెళ్తామని చెప్పారు.
అత్తమ్మ, సిద్ధూ వాళ్ళింటికి వెళ్ళారు. నేను అమ్మానాన్నలతో ఇంటికి వచ్చేసరికి అక్క, బావ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అక్క హారతి ఇచ్చి నన్ను ముందు కుడిపాదం పెట్టి ఇంట్లోకి రమ్మంది.
(సశేషం)
🙏🏻🙏🏻🙏🏻 ప్లీజ్ గివ్ యువర్ కామెంట్స్