డబ్బులు ఇచ్చేసా. బయటికి వచ్చి ఆన్ చేసి చూసా. కాల్ రిజిస్టర్లో నా కొలీగ్ నంబర్స్ ఉన్నాయి. ఒకే నెంబర్ నుండి చాలా
మెసేజీలు ఉన్నాయి. ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యా. ఆ మెసేజ్ లు పంపింది భారతి.
వెంటనే ఫోన్ చేశాను. తను రెస్పాండ్ అయింది. ఏరా ఎన్ని సార్లు ఫోన్ చేసినా
ఆన్సర్ చేయవేమిటి? ఎక్కడికి పోయావు? అంది.
నేను "ఎక్కడికీ పోలేదు. ఇంతకు ముందే మీ ఇంటికి వస్తే లాక్ చేసి ఉంది.
ఇక మీ కాల్స్ కి ఆన్సర్ లేదంటావా? అది ఒక పెద్ద విచిత్ర గాథ. త్వరలో కలుద్దాము. మా
ఇంటికి రా " అన్నాను.
సరే ... అని అయినా గర్ల్ ఫ్రెండ్స్ ఇంటికి రావడం మీ ఇంట్లో వాళ్లకు నచ్చదు కదరా అంది.
అందుకు నేను "అప్పుడు వేరు ఇప్పుడు వేరు అన్నీ మూసుకుని ఇంటికి రావే
నీకే తెలుస్తుంది" అన్నాను
సరే అంది. నేను బై చెప్పి ఫోన్ పెట్టేశాను. ఇంటికి వెళ్ళిపోయాను.
అమ్మా నాన్న వాళ్ళు రావడానికి రెండురోజులు పడుతుంది. బోర్ కొడుతోంది. రోజూ
మాట్లాడుకుంటున్నా ఎందుకో సిద్ధార్ధ్ ని చూడాలనిపించి ఫోన్ చేశాను. ఆఫీసులో
ఉన్నట్లున్నాడు వెంటనే ఆన్సర్ చేయలేదు. కొంతసేపటికి తనే కాల్ బ్యాక్ చేశాడు.
సిద్ధార్ధ్: హలో చెప్పండి శ్రీమతి గారూ
నేను : ఫోన్ చేసిన వెంటనే ఆన్సర్ చేయకుండా ఇప్పుడు ముద్దు చేస్తున్నావా. యూ
ఆర్ ఏ క్లవర్ మాన్
సిద్ధార్ద్: లేదు బేబీ ముంబై నుండి మన క్లైంట్స్ వస్తే మాట్లాడుతున్నాను.
సరే కానీ ఏమిటి విశేషాలు? మీ పేరెంట్స్ ఊళ్ళో లేరుకదా ఏం చేస్తున్నావు?
నేను : మా శ్రీవారితో మాట్లాడుతున్నాను
సిద్ధార్ధ్: వట్టి మాటలేనా? ఏమైనా బహుమానాలున్నాయా?
నేను: ఏయ్! పెళ్లవకుండా ఆ పప్పులేమీ ఉడకవ్ బాబూ
సిద్ధార్ధ్: నీకు తెలుసా ప్రతి రాత్రీ కల లోకి వచ్చి.... నన్ను టార్చర్
పెట్టేస్తున్నావు. ఎప్పుడు పెళ్ళవుతుందా అని క్యాలెండరులో డేట్స్ కౌంట్
చేసుకుంటున్నాను
నేను: బాగా మోసేస్తున్నావుగా.... ఇంత ఫ్లర్టింగా.... నేను
తట్టుకోలేకపోతున్నాను
సిద్ధార్ద్: సరే కానీ.... సాయంత్రం అట్లా బయటకి వెళ్దామా? నిన్ను ఏమీ
చేయను.... కనీసం ముట్టుకోను..... ప్లీజ్ బేబీ అని బ్రతిమాలాడం మొదలెట్టాడు
నేను ముందు బెట్టు చేసినా నాకూ ఇంట్లో ఒంటరిగా ఉండబుద్దవక సరే అన్నాను.
ఈవెనింగ్ 7గంటలకు ఆఫీస్ నుండి డైరెక్ట్ గా వచ్చేస్తా అని చెప్పాడు
సిద్ధార్ధ్. వాళ్ళ ఆఫీస్ నుండి మా ఇంటికి తను రావడానికి ఎంత లేదన్నా ఒక గంట
పడుతుంది. అంటే రాత్రి 8 గంటలకు బయటకు వెళ్తాము సో మనకు ప్రాబ్లెమ్ లేదనుకున్నాను.
అప్పటికి మధ్యాహ్నం 2.30 గంటలు కావస్తోంది.
భోజనం చేసి కాసేపు నిద్రపోయాను.
సరిగ్గా 3.30 గంటలకు ఫోన్ రింగయ్యింది.
అవతల్నుండి సిద్ధార్ద్.
హలో నీలూ! అనూస్ బ్యూటీ పార్లర్ వాళ్లకి ఫోన్
చేసి డోర్ సర్వీస్ ఇమ్మన్నాను. వాళ్ళు వచ్చి నా డార్లింగ్ కి మేకోవర్ చేస్తారు.
సరేనా అన్నాడు.
ఓరి దేవుడా! ఇదొకటా అనుకొని నిండా మునిగాక
చలేమిటి అనుకొని "ఓకే డార్లింగ్" అన్నాను.
సిద్ధార్థ్ వెంటనే "బేబీ, నువ్వు ఈవెనింగ్
వేసుకొనే డ్రెస్ కూడా సెలెక్ట్ చేశాను. నువ్వు వచ్చే మేకప్ టీమ్ కు సహకరించు.
ప్లీజ్ నా మాట కాదనకు స్వీట్ 💖 హార్ట్ అన్నాడు
ఇప్పటి వరకు అమ్మా నాన్న, అక్క, సిద్ధార్ద్
వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ మధ్య తప్ప నేను ఎవరిముందూ ఆడదానిలా మసలలేదు. ఇప్పుడు
సిద్ధార్ధ్ పెట్టిన ఫిట్టింగ్ వల్ల నాలో ఏదో తెలియని జంకు.
అదే సిద్ధార్ధ్ తో చెబితే "మనం ఎలైట్
సర్కిల్లో మనుషులం. మన దగ్గర డబ్బు, సంపద చూస్తారు. ఇవన్నీ మాట్లాడుకునే తీరిక
ఎవరికీ ఉండదు నీలూ. మన టేస్ట్ కు తగ్గట్లు మనకు సర్వీస్ ఇస్తారు. ఇచ్చిన సర్వీసుకు
సొమ్ములు తీసుకుంటారు. తుమ్ ఫికర్ మత్ కరో. మై హూ నా" అన్నాడు.
ఇక మాట్లాడటానికి ఏముంది? సరే అని ఫోన్
పెట్టేసి వెళ్ళి పసుపు, నలుగు పిండి ఒంటికి పట్టించి వేడి నీళ్ళతో తలస్నానం చేసి
లావెండర్ కలర్ నైటీ వేసుకుని హాల్లో కూర్చొని టీవీ చూడసాగాను.
ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. వెళ్ళి తలుపు
తీశాను.
ఒక 23 ఏళ్ళ అమ్మాయి చేతిలో పెద్ద పెద్ద
బ్యాగేజీలతో నిలబడి "మేడం! నీలిమ అంటే మీరేనా" అని అడిగింది. నేను
ప్రతిగా తలూపాను. "సిద్ధార్థ్ సర్ బుక్ చేశారండి. మే ఐ కమిన్" అని
వినయంగా అడిగింది.
నేను "సారీ లోపలికి రండి" అని తలుపు
వేశాను.
తను లోపలికి వచ్చి చేతిలోని ఐటమ్స్ ని క్రింద
పెట్టి నా ఎదురుగా సోఫాలో కూర్చుంది. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు.
మేడం! మేము మా కస్టమర్స్ కు వారు అడిగిన
సర్వీస్ ఇస్తాము. ఒకరి గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడము. మీ గురించి సార్
ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరంటే సార్ కి ఎంతో ఎఫెక్షన్. మంచి సర్వీస్ ఇస్తే ఫ్యూచర్
లో కూడా మమ్మల్నే కంటిన్యూ చేస్తామని మీకు నచ్చినట్లు, మీకు ఏ ఇబ్బందీ
కలిగించకుండా మేకోవర్ చేయించమన్నారు. By ది బై నా పేరు రోహిణి. మీరు నాతో ఫ్రీగా
మూవ్ అవ్వండి మేడం. మిమ్మల్ని సార్ ప్రక్కన గ్లామరస్ డాల్ గా నిలబెట్టే బాధ్యత
నాది అంది రోహిణి.
నేను చిరునవ్వు నవ్వి "థాంక్ యూ
రోహిణీ" అంటూ "కాఫీ ఆర్ టీ" అని అడిగాను.
మేడం కాఫీ మీకు ఇబ్బంది లేకుంటేనే. ఈలోపు నేను
ఐటమ్స్ రెడీ చేస్తాను ఆంది రోహిణి.
నేను కిచెన్ లోకి వెళ్ళి కాఫీ
పెట్టుకొచ్చేసరికి తను తెచ్చిన బ్యాగ్స్ లోని ఐటమ్స్ బయట పెట్టింది రోహిణి.
నేను ఇచ్చిన కాఫీ త్రాగుతూ "మేడం సార్
ఈవెనింగ్ అవుటింగ్ కొరకు సార్ కాటన్ శారీ సెలెక్ట్ చేశారు. సమ్మర్ హీట్ ఉంటుంది
కదా తనకు అసౌకర్యంగా ఉంతుందన్నారు. అందుకే కాటన్ శారీస్ తెచ్చాను మేడమ్. మీకు
నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి. నేను ఫేషియల్, మానిక్యూర్, పెడిక్యూర్ చేశాక శారీ
కట్టుకుందురు మేడమ్ " అంది.
ఒక్క సాయంత్రం తనతో బయటకు
తీసుకువెళ్ళడానికి నా మీద ఇంత ఖర్చు పెడుతున్నారు. రేపు పెళ్లి తతంగం
పూర్తయితే ఇంకెంత ఖర్చు పెడతాడో ......! పెళ్ళి చూపులైన తరువాత ఫోన్లో
మాట్లాడుకోవడం, రాత్రయితే వీడియో కాల్స్ లో చూసుకోవడం తప్ప ప్రత్యక్షంగా తనతో
గడపడానికి సమయం రాలేదు .... ఇంట్లో ఒంటరిగా ఉండడం వల్ల బోరు కొట్టి తనతో కాసేపైనా
గడపొచ్చని, తనతో పెళ్ళికి ఒప్పుకున్న తరువాత నాలో వచ్చిన ఆడతనపు ఛాయలు, నేను
నేర్చుకున్న వంటకాల తాలూకు రుచులు తనకు చూపిద్దామనుకున్నాను. కానీ గురుడు వేరేలా
ప్లాన్ చేసాడు అనుకున్నాను.
ఇక తనతో మాట్లాడి లాభం లేదు. తను ఆశ
పడుతున్నట్లు ముస్తాబవుదాము. ఆ తరువాత తను వచ్చాక ఆలోచిద్దాం అనుకొని రోహిణితో
"ఓకె. ఆయనకు ఎట్లా అయితే బావుంటుందో అట్లానే చేయమన్నాను. తను అందుకు సరే అని
' మేడమ్, ముందు ఫేషియల్, పెడిక్యూర్, మానిక్యుర్ చేసేస్తాను. ఆ తరువాత ఒక లోషన్
ఇస్తాను అది బాడీ అంతా అప్లై చేసి స్నానం చేసిరండి అని అంటూ ఫేషియల్, చేయడం మొదలు
పెట్టింది. పెడిక్యూర్, మనిక్యర్ అయిన తరువాత 'ముందే స్నానం చేసినా సరే....
మళ్లీ వేడినీళ్లతో స్నానముచేసి రండి. వాటర్ లో ఈ రోజ్ వాటర్ కూడా కలుపుకోండి మేడమ్
అంటూ ' అంటూ నా చేతిలో ఒక లోషన్, రోజ్ వాటర్ బాటిల్ పెట్టింది.
బాత్రూములోకి వెళ్ళి చూస్తే చాలా కాస్ట్లి సబ్బు, షాంపూలు ఉన్నాయి. ప్రక్కన హాంగింగ్ రాడ్ కి పెద్ద సైజ్ టర్కీ టవల్ వేలాడుతోంది.
అంటే ఫేషియల్ చేసేటప్పుడు నేను కళ్ళు మూసుకున్న సమయంలొ రోహిణి ఈ ఏర్పాట్లు చేసి
ఉంటుంది. ఇక్కడ కేవలము నేను నిమిత్త మాత్రుడినని అర్థం అయ్యింది.
ఆ ప్రక్కనే ప్యాంటీ, ఆడవాళ్ళు పెద్ద పెద్ద హోటల్స్ లో స్నానం చేశాక
వేసుకొనే బాత్రోబ్ వేలాడుతున్నాయి. అది చాలా ఖరీదైనదిగా చూస్తుంటేనే తెలుస్తోంది.
తను ఇచ్చిన లోషన్ శరీరమంతా అప్లై చేశాను. అక్కడక్కడా ఉన్న రోమాలన్నీ రాలిపోయాయి.
ఆపైన నులివెచ్చని నీళ్లలో రోజ్ వాటర్ కలిపి స్నానం చేస్తుంటే ఎంతో హాయిగా ఉంది.
తను అక్కడ పెట్టిన సబ్బు రాసుకుంటుంటే ఆ బాత్రూం అంతా సువాసనతో నిండిపోయింది.
షాంపూతో తలస్నానం చేశాను. వళ్ళంతా జాగ్రత్తగా తుడుచుకొని తను అక్కడ తగిలించిన
ప్యాంటీ వేసుకోసాగాను. ఆ సిల్క్ ఫ్యాబ్రిక్ ఒంటికి తగలగానే నాలో ఏదో తెలియని
ఎరెక్షన్. నా జూనియర్ మాట విననంటున్నాడు. వాడిని అణచడానికి చాలా అవస్థలు పడి
మొత్తానికి ప్యాంటీ తొడిగి, పైన టర్కీ బాత్ రోబ్ వేసుకుని బయటకు వచ్చాను.
లోపల ప్యాంటీ వేసుకొని, పైన బాత్ రోబ్ తో వచ్చిన నన్ను చూసి రోహిణి చిరునవ్వుతో
....
"మేడం! ఇప్పుడు మీ బోడీలో గ్లో కనపడుతోంది. ఒక్క పది నిమిషాలు సహకరించారంటే
మిమ్మల్ని బ్యూటిఫుల్ గా తయారు చేసే బాధ్యత నాది" అంది.
ఇదివరకటి బెరుకు నాలో లేదు ... ఇంతవరకు వచ్చాక నేను భయపడటంలో అర్ధం లేదని ఒక
నిర్ణయానికి వచ్చేసాను.
అంతలో రోహిణి, "మేడం... ఆ బాత్ రోబ్ రిమూవ్ చేసేయండి.. అంది. నేను తన ముందు
కేవలం పాంటీలో నిలబడాలంటే సిగ్గు పడుతున్నాను ... కానీ తప్పదు ... బాత్ రోబ్ తీసి ప్రక్కన
ఉన్న పెట్టాను. ఇప్పుడు తన ముందు ప్యాంటీతో నిలబడ్డాను. ప్రక్కన ఉన్న సోఫాలో పడుకొమ్మంది.
ఆమె చెప్పినట్లే వెల్లకిల్లా పడుకున్నాను.
తను ప్రక్కన ఉన్న సూట్ కేసు ఓపెన్ చేసి అందులోనుండి ఒక బాక్స్ తీసింది. బాక్స్
ఓపెన్ చేసింది. అందులోనుండి ఖరీదైన బ్రెస్ట్ ఫార్మ్స్ ఉన్నాయి. అవి తీసి నా ఛెస్ట్
కి ఏదో జెల్ రాసి ఆ బ్రెస్ట్ ఫార్మ్స్ ని అమర్చింది. కాసేపు వెయిట్ చేసాక లేచి నిలబడమంది.
నా రొమ్ముల దగ్గర బరువుగా .... వ్రేలాడుతున్నాయి అప్పుడే వ్రాసింది. బ్రెస్ట్ ఫామ్స్.
ఆపైన ఖరీదైన మాచింగ్ బ్రా తొడిగింది. నేను సెలెక్ట్ చేసిన చీర ఉన్న బ్యాగ్ ని
తీసి అందులో ఉన్న మాచింగ్ జాకెట్ తొడిగింది. అందులోనే ఉన్న ఖరీదైన లోపలి లంగాను నా
తలపై నుండి తొడిగి నడుము దగ్గర ముడి వేసింది. ఆ తరువాత చీరను తీసి నా భుజము పైన వేసి
ఒక అంచును లోపలి లంగాలోకి తోసి కుచ్చిళ్ళు పోసింది. పళ్ళు జారిపోకుండా భుజం వద్ద సరి
చేసి సేఫ్టీ పిన్ పెట్టింది.
తరువాత మొఖానికి కొంచెం మేకప్ చేసింది. లిప్ స్టిక్ వ్రాసింది. కళ్ళకు సుర్మా
.... ఆ తరువాత చేతికి గాజులు, అరవంకీలు, నడుముకు కందోళీ తొడిగింది. చెవులకు బంగారు
చెవులీలు, ముక్కు పై ముక్కుపుడక అమర్చింది.
పాదాలకు హై హీల్స్ తొడిగి అటూ ఇటూ నడవడం ప్రాక్టీస్ చేయమంది. మొదట ఇబ్బందిగా
ఉన్నా తరువాత అలవాటైంది. ఇద్దరమూ ఎదురెదురుగా కూర్చున్నాము.
ఇప్పుడు రోహిణితో ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను. తనని అడిగాను "రోహిణీ
! ఈ సర్వీస్ కి ఒక్కో సెషన్ కి మీరెంత ఛార్జ్ చేస్తారు"
మేడం! మేము సాధారణంగా ఒక పదివేలు ఛార్జ్ చేస్తాము. కానీ సర్ మీకోసం ఎంతైనా పర్వాలేదని
గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా పంపడంతో వితౌట్ ఆర్నమెంట్స్, మేము ముప్పై వేలు ఛార్జ్ చేశామంది.
తాను చెప్పిన ఫిగర్ విని నా గుండె ఝల్లుమంది. సిద్ధార్ధ్ మీద ప్రేమ రెట్టింపై
పోయింది. తను ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడసాగాను. ఇంతలో బయట కారు ఆగిన శబ్దం. నా గుండెలు
అదురుతున్నాయి... మగాడిని ఆడదాని వేషంలో ఒక మగాడికోసం అభిసారికలా వేచిచూడటం .... ఇదంతా
విచిత్రంగా ఉంది.
సిద్ధార్ధ్ లోపలికి వచ్చాడు. నన్ను చూసినా ఏం మాట్లాడకుండా రోహిణిని చూసి
"థాంక్యూ రోహిణి" అని తన వాలెట్ తీసి కొన్ని రెండువేల నోట్లు తనకు టిప్ ఇచ్చాడు.
అందుకు హ్యాపీగా ఫీల్ అయిపోయిన రోహిణి "థాంక్యూ సర్. హోప్ మై సర్వీస్ విల్ బీ
గ్లాడ్ తో యూ" అంది. అందుకు సిద్ధార్ధ్, ఓకే . ఐ విల్ కాల్ యు రెగ్యులర్లీ . యు
మే లీవ్ నౌ" అన్నాడు.
ఓకే సర్.... అంటూ నాతో థాంక్యూ మేడం ఫర్ యువర్ కో ఆపరేషన్ అని నాకు చెప్పి తన
సామగ్రితో బయటికి నడిచింది. ఆమె వెళ్లే వరకు డీసెంట్ గా ఉన్న సిద్ధార్ధ్ ఆమె వెనుకే
వెళ్లి తలుపు మూసి నా వైపు చిలిపిగా చూస్తూ...
"వావ్ ... మై గాడెస్ .... యు అర్ లూకింగ్ గార్జియస్" అంటూ దగ్గరికి
వచ్చి నన్ను కౌగలించుకుని నా పెదవులపైన సున్నితంగా కిస్ చేసాడు.